తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ అంటేనే అనసూయ అని చెప్పాలి.నిజానికి ఈమె అందానికి మరో యాంకర్ పోటీకి రాదని చెప్పాలి.
గ్లామర్ హీరోయిన్లకు పోటీగా షో చేస్తూ అందరిని తన వైపు మలుపుకుంటుంది.అనసూయకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఆమె గ్లామర్ ను ఇంకా రెట్టింపు చేసుకుంది.
ఇక లేటు వయసులో కూడా తన హాట్ అందాలతో బాగా రెచ్చిపోతూ ఉంటుంది.
ఇక అనసూయ మొదటిసారిగా టీవీలో యాంకర్ గా చేసింది.
ఆ తర్వాత వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో అడుగుపెట్టింది.ఇక ఎప్పుడైతే తను జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిందో అప్పటినుంచి అందరి దృష్టి తనపై పడింది.
జబర్దస్త్ షోను కామెడీ కోసం కంటే ఎక్కువగా అనసూయ గ్లామర్ కోసం, తన డాన్స్ ల కోసం చూడటానికి ఇష్టపడేవాళ్లు.
ఇక ఈ క్రేజ్ తోనే ఆమె వెండితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది.
మెగా హీరో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా నటించి ఓవర్ నైట్ లో మరింత క్రేజ్ సంపాదించుకుంది.దీంతో అప్పటినుంచి వెండితెరపై కూడా వెనుతిరగకుండా వరుసగా చాలా సినిమాలలో అవకాశాలు అందుకుంది.
కొన్ని సినిమాలలో మెయిన్ రోల్ కూడా చేసింది అనసూయ.ఓ వైపు జబర్దస్త్ యాంకర్ గా ఉంటూనే మరోవైపు వెండితెరపై నటిగా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.
ఇక కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగులల్లో కూడా చిందులేసింది.ఇక ఇటీవలే పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ పాత్రలో నటించి మరింత గుర్తింపు పొందింది.అయితే ఆ మధ్యనే జబర్దస్త్ కు గుడ్ బై చెప్పటంతో తన బుల్లితెర ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు.ఆమెను మళ్లీ బుల్లితెరపై చూడలేము అని బాగా ఆవేదన చెందారు.
కానీ ఈమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉండటంతో ఫ్యాన్స్ కాస్త సంతోషంలోనే ఉన్నారు.నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు అనసూయ.బాగా ఫోటో షూట్ లు తీయించుకుంటూ వాటిని పంచుకుంటూ ఉంటుంది.అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం వెంటనే ఫైర్ అవుతూ ఉంటుంది.
ఇక అనసూయ ఈ వయసులో కూడా ఇంత ఫిట్ గా ఉంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఒకవైపు ఫ్యామిలీని చూస్తూ, మరోవైపు సినిమాలు చేస్తూ.తన శరీరం పట్ల జాగ్రత్త తీసుకుంటుంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో తను పొట్టి నిక్కర్ వేసుకొని ఉండగా తన థైస్ అందాలు కనిపించేలా చూపించింది.
అంతేకాకుండా తను చాలా ఫిట్ గా ఉండటంతో.చాలామంది కుళ్లు కుంటున్నారు.ఈ వయసులో కూడా మీరు ఇలా ఉన్నారు అంటే మామూలు విషయం కాదు అని పొగుడుతున్నారు.ఇక కొంతమంది తన ఫిట్నెస్ జర్నీ గురించి సోషల్ మీడియా ద్వారా తెలుపమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరి ఫ్యాన్స్ కోసం అనసూయ తన ఫిట్నెస్ జర్నీ గురించి చెబుతుందో లేదో చూడాలి.