టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరుగురు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు ఉండగా ఈ ఆరుగురు హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపుతో పాటు సినిమా సినిమాకు మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.ఈ హీరోలలో కొంతమంది హీరోలు ఒకే సమయంలో మూడు కంటే ఎక్కువ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.
అయితే ఈ హీరోలు ఎక్కువ సినిమాలు చేయడం వెనుక షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ ఆరుగురు హీరోలలో ఒక హీరో ఇద్దరు డూప్ లపై ఆధారపడి సినిమాల్లో నటిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోకు ఇప్పుడు వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా కొన్నేళ్ల క్రితం వరుగా ఇండస్ట్రీ హిట్లు ఖాతాలో చేరాయి.క్లోజ్ షాట్ లు, ఎమోషనల్ షాట్ లు మినహా మిగతా సన్నివేశాల్లో డూప్ లను తీసుకోవాలని ఆ హీరో దర్శకనిర్మాతలకు సూచనలు చేసినట్టు సమాచారం అందుతోంది.

100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఆ హీరో ఈ విధంగా చేయడం దర్శకనిర్మాతలకు చిరాకు తెప్పిస్తున్నా వేరే ఆప్షన్ లేక హీరో చెప్పిన మాటకు దర్శకనిర్మాతలు తలూపుతున్నారు.ఇద్దరు డూప్ లను పెట్టుకున్న ఏకైక హీరో ఆ స్టార్ హీరో మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కష్టమైన సీన్లు అన్నీ ఆ స్టార్ హీరో డూప్ లకు అప్పగిస్తున్నారని బోగట్టా, ఆ స్టార్ హీరో డూప్ కు కూడా బాగానే పాపులారిటీ ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరో గత సినిమాలలో కూడా డూప్ లకు ప్రాధాన్యత ఇవ్వగా ఆ సమయంలో ఈ హీరో లుక్స్ పై విమర్శలు వచ్చాయి.భవిష్యత్తులో దర్శకులు డూపులతోనే సినిమాలు చేస్తారేమో అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.







