'ది ఎలిఫెంట్ విష్పరర్స్' దర్శకురాలి దారుణ మోసం బట్టబయలు?

టాలీవుడ్ నుండి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలోని ‘నాటునాటు’ పాటకి ఆస్కార్ అవార్డు లభించగా, కోలీవుడ్ నుంచి ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’( The Elephant Whisperers ) అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు లభించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే తాజాగా ఈ డాక్యుమెంటరీ తీసిన డైరెక్టర్ ‘కార్తికి గోన్‌సాల్వేస్’( Karthiki Gonsalves ) చేసిన మోసం బయటపడింది.

 The Elephant Whisperers' Director's Fraud Revealed , The Elephant Whisperers, Do-TeluguStop.com

విషయం ఏమిటంటే… ఈ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, బెల్లీ దంపతుల పట్ల ఆమె చాలా దారుణంగా ప్రవర్తించిందట.

Telugu Documentary, Kartiki, Latest, Oscar-Latest News - Telugu

తమిళనాడుకు చెందిన బొమ్మన్, బెల్లీలు( Boman, bellies ) మొదటి నుండీ ఏనుగులను సంరక్షిస్తుంటారు.అందుకే వారినే పెట్టి డాక్యుమెంటరీ తీస్తే చాలా నేచురల్‌గా ఉంటుందని కార్తికి అభిప్రాయపడింది.ఆమె ప్రపోజల్ కి బొమ్మన్, బెల్లీ కూడా ఆనందంగా ఒప్పుకోవడం జరిగింది.

అయితే డాక్యుమెంటరీ తీస్తున్న సమయంలో ఓ సీన్ తీయడానికి దర్శకురాలి దాదాపు లక్ష వరకు ఖర్చు అవుతుందని భావించింది కానీ, తన దగ్గన అంత డబ్బు లేదని వారితో చెప్పడంతో పాపం బొమ్మన్, బెల్లీ తాము దాచుకున్న లక్ష తీసి కార్తికికి ఇచ్చారు.ఆ మొత్తం షూటింగ్ అయ్యాక ఇచ్చేస్తానని చెప్పిన కార్తికి ఇపుడు అసలు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడంలేదని వినికిడి.

Telugu Documentary, Kartiki, Latest, Oscar-Latest News - Telugu

ఇకపోతే, డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చినప్పుడు తమను కనీసం ఆ అవార్డును కూడా పట్టుకోనివ్వలేదని బొమ్మన్ దంపతులు తాజాగా ఓ మీడియా ముందు షాకింగ్ ఆరోపణలు చేయడం కొసమెరుపు.అంతేకాకుండా కార్తికి తమకు రూ.2 కోట్ల వరకు డబ్బు ఇవ్వాల్సి ఉందని, వారితో డాక్యుమెంటరీ తీయాలని కార్తికి ఓ నిర్ణయానికి వచ్చినపుడు బొమ్మన్, బెల్లీలతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుందట.డాక్యుమెంటరీ బాగా వస్తే కొంత డబ్బు, ఒక మంచి ఇల్లు కూడా వారికి ఇప్పిస్తానని మాటిచ్చిందట.

ఇపుడు ఆమె ఆస్కార్ వచ్చినా తమను కనీసం పట్టించుకోవడంలేదని బొమ్మన్ దంపతులు వాపోయారు.దాంతో వారు ఓ అడ్వొకేట్ సాయంతో కార్తికిపై పిటిషన్ దాఖలు చేసారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube