ఎన్‌క్లోజర్‌లో పడిన షూ తిరిగి ఇచ్చేసిన ఏనుగు.. వీడియో చూస్తే ఫిదా..

ఏనుగులు( Elephant ) చాలా తెలివైనవి.వాటి జ్ఞాపక శక్తి కూడా అమోఘం అని చెప్పుకోవచ్చు.

 The Elephant Returned The Shoe That Fell In The Enclosure, Viral Video, Latest-TeluguStop.com

సాధారణంగా ఇతరుల వస్తువులు మనకు సమీపంలో కింద పడినప్పుడు దానిని తీసి వారికి ఇచ్చేస్తుంటాం.ఆ తెలివి, దయ మనకి మాత్రమే కాదు ఏనుగులకు కూడా ఉన్నాయని ఒక వైరల్ వీడియో చెప్పకనే చెబుతోంది.

వీడియోలో మనం ఒక పెద్ద ఏనుగు ఓ షూ తిరిగి మనుషులకు ఇవ్వడం చూడవచ్చు.ఈ ఏనుగు చైనాలోని షాండియో యానిమల్ నేచర్ రిజర్వ్‌లో నివసిస్తోంది.

అయితే దీనిని చూసేందుకు రోజూ ఎంతోమంది విజిటర్లు వస్తుంటారు.ఒకానొక రోజు ఒక పిల్లోడు దీనిని చూసేందుకు వచ్చాడు.ఆ పెద్ద ఏనుగును దగ్గర్నుంచి చూడటంతో పిల్లోడు కేరింతలు కొట్టాడు.ఆ క్రమంలో తన ఆట షూ ఏనుగు ఎన్‌క్లోజర్‌( Enclosure )లో పడేసాడు.ఆపై ఏడవటం మొదలుపెట్టాడు.అయితే దీనిని గ్రహించిన సదరు ఏనుగు ఆ పిల్లోడికి తిరిగి ఆ షూ ఇచ్చేసింది.

దీనికి సంబంధించిన వీడియోను సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.ఆ వీడియో ఓపెన్ చేస్తే ఏనుగు చాలా సున్నితంగా బొమ్మను తన తొండంతో పట్టుకుని ఆపై ఎన్‌క్లోజర్‌ బయట నిలబడి ఉన్న పిల్లోడి తల్లిదండ్రులకు అందజేయడం మనం గమనించవచ్చు.ఈ వీడియో చూసి చాలామంది ఫిదా అవుతున్నారు.ఆ ఏనుగు చాలా మంచిది అని, స్మార్ట్ అని కామెంట్లు చేస్తున్నారు.అడవి జంతువులలో కూడా దయ ఉంటుందని ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోవచ్చని మరి కొందరు అన్నారు.ఈ వీడియోకు 7 లక్షల కు పైగా వ్యూస్, పదివేల దాకా లైక్స్ వచ్చాయి దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube