టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో వైసీపీ పతనం మొదలైందని చెప్పారు.
ఈ క్రమంలో ఏ ఎన్నిక వచ్చినా టీడీపీదే విజయమని తెలిపారు.
ఏపీలో నడిరోడ్డుపై హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయన్న చంద్రబాబు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు.
ఏపీలో ఎక్కడ చూసినా ఇసుకాసురులే కనిపిస్తున్నారన్నారు.గతంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు.
కానీ అది ఇప్పుడు తెలంగాణలో భాగం అయిందన్నారు.టీడీపీ హయాంలో ఏనాడు కరెంట్ రేట్లు పెంచలేదన్నారు.
అంతేకాకుండా రైతు రుణమాఫీలు, పెన్షన్ల పెంపుతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన చరిత్ర టీడీపీదని తెలిపారు.కాకినాడ జిల్లాలో నిర్వహించిన టీడీపీ జోన్ -2 సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.