ఫొటోలోని ఫుడ్ తిందామనుకున్న కుక్క.. నెట్టింట నవ్వులే నవ్వులు!

తెలివైన జంతువుల్లో కుక్కలు టాప్ ప్లేస్ లో ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.కుక్కలు టీవీ చూస్తూ కూడా ఎంజాయ్ చేయగలవు.

అయితే మనుషుల దృష్టితో పోలిస్తే కుక్కల కంటిచూపు వేరేలా ఉంటుంది.అందువల్ల ఇవి టీవీలను కాస్త దగ్గరగా చూడాల్సి వస్తుంది.

అయితే శునకాలు టీవీలను మాత్రమే కాదు ఫొటోలను కూడా చూసి రియాక్ట్ అవ్వగలవు.అయితే తాజాగా ఒక కుక్క ఒక ఫొటో చూసి అది నిజమే అనుకొని భ్రమ పడింది.

ఆ తర్వాత అది చేసిన పని చూస్తే నవ్వురాక తప్పదు.దీనికి సంబంధించిన వీడియోని ఒక యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది.

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక కుక్కపిల్ల పాస్తా, మీట్‌బాల్‌ల ఫొటోలను చూడటం గమనించవచ్చు.

అనంతరం అది తను చూస్తున్న ఫొటోల్లో ఉన్నది నిజమైన ఫుడ్ అని భ్రమ పడింది.అలా అది వాటిని తినేందుకు బాగా ప్రయత్నించింది.

చివావా మిక్స్‌గా భావించే ఈ కుక్కకూన బాగా ఆకలితో ఉన్నట్టు ఉంది.అందుకే అది అలా ఫొటోలో కనిపించే ఫుడ్ తినడానికి బాగా ప్రయత్నించింది.

ఇదిలా ఉండగా మరో కుక్క తన పిల్లలకు ఆహారం ఇచ్చినందుకు ఒక మహిళను కౌగిలించుకుని థాంక్స్ చెప్పింది.దీనికి సంబంధించిన వీడియో కూడా వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ క్లిప్‌లో, ఒక మహిళ వీధి కుక్కపిల్లలకు ఆహారం తినిపించడం చూడవచ్చు.ఆ తర్వాత అది తన పిల్లలకు ఆహారం పెడుతున్న మహిళకు ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు