వైరల్: పార్టీలో మందేసి చిందేస్తున్న శునకం... మనుషులకు తక్కువేమి కానంటోంది!

శునకం… అదేనండి! కుక్క, మద్యం తాగడమేమిటాని ఆశ్చర్యపోకండి.ఇలాంటి కల్చర్ మనదగ్గరకు ఇంకా వచ్చిందో రాలేదో మనం చూడలేదు గాని, ఫారిన్ కంట్రీలలో ఇది మామ్మూలు విషయమే.

 The Dog That Is Drunk Party... It Seems That Humans Are Not Enough! , Dog, Dr-TeluguStop.com

అక్కడ మందు తాగడం చాలా సర్వ సాధారణమైన అంశం.అదే విధంగా వారు పెంచుకొనే మూగ జీవాలకు కూడా వారు మందుని పోస్టు వుంటారు.

తాజాగా అలాంటి ఓ సంఘటనే జరుగగా ప్రస్తుతం సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ఇకపోతే మత్తు చిత్తులో చాలామంది మందు బాబులు మందు భామలు (విదేశాల్లో) వీధుల్లో తూలతూగుతూ ఈ ప్రపంచాన్ని మైమరచిపోయి పడిపోవడం, లేదా నానా హంగామా సృష్టించడం, అటుఇటు ఊగిపోతూ నడవడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.

అయితే ఓ కుక్క మద్యం సేవించి, ఆ మత్తులో చిత్తై పిచ్చిపిచ్చిగా దొలిగిల్లడం ఎప్పుడైనా చూసారా? లేదు కదూ.అలా అయితే ఇక్కడ వీడియోని చూసి మీ కోరిక నెరవేర్చుకొండి.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోలో ఒక కుక్క తన యజమాని పక్కన కూర్చొని ఎంచక్కా మద్యం సేవించింది.ఇంకేముంది కేట్ చేస్తే, మత్తులో ఏం చేస్తోందో దానికే తెలియక ప్రార్తించడంతో యజమానులు దానిని ఓ మనిషివలె సాకడం మొదలు పెట్టారు.కాగా దీనికి సంబందించిన వీడియోని చూసి నెటిజన్లు కొంతమంది నవ్వుకుంటే కొంతమంది మాత్రం మూగ జీవి ఆ పరిస్థితికి రావడానికి కారణం దాని యజమాని కావున అతనే బాధ్యత వహించాలని సూచిస్తున్నారు.అంతేకాకుండా మూగజీవాలను అలా హింసించడం తగదని కూడా వారికి కామెంట్ల రూపంలో హెచ్చరిస్తున్నారు.

గోల్డెన్స్‌ఫ్రెండ్ అనే ఖాతాలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కాగా ఇపుడు అది కాస్త వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube