తప్పిపోయిన పిల్లి.. దాన్ని కనుగొనడంలో రెస్క్యూ టీమ్‌కి సహాయపడ్డ కుక్క..

మనుషులు తీసిన గుంటలలో జంతువులు పడిపోయి చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ గుంటలలో మనుషులు కూడా పడుతూ ప్రాణాలను పోగొట్టుకుంటారు.ఇటీవల సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్( England ), ఆగ్నేయ కార్న్‌వాల్‌లో కూడా మోగ్లీ అనే పిల్లి మనుషులు తీసిన ఒక మైన్‌షాఫ్ట్‌లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

 The Dog That Helped The Rescue Team Find The Missing Cat , Cat Rescued, Mineshaf-TeluguStop.com

ఇది తన ఇంటి సమీపంలోని 100 అడుగుల లోతైన మైన్‌షాఫ్ట్‌లో పడిపోవడంతో యజమానులు అది ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. మైన్‌షాఫ్ట్ అనేది భూగర్భ గని నుంచి ఖనిజాలను చేరుకోవడానికి, వెలికితీసేందుకు తవ్విన లోతైన మార్గం.

పిల్లి యజమానులు డైసీ అనే ఓ కుక్కను కూడా పెంచుకుంటున్నారు.అయితే ఆ కుక్కే పిల్లి జాడను కనుగొనడంలో సహాయపడింది.

పిల్లి( Cat ) తప్పిపోయి రెండు రోజులు గడవడంతో యజమానులు బాగా ఆందోళన చెందారు.కానీ సేవియర్ లాగా డైసీ కుక్క తన వాసన పసికట్టే సామర్థ్యంతో పిల్లి ఎక్కడుందో తెలుసుకోగలిగింది.

మోగ్లీ యజమాని మిచెల్ రోస్ అక్టోబర్ 20న పిల్లి అదృశ్యమైనప్పుడు బాధపడింది.ఆమె దాని కోసం ప్రతిచోటా వెతికింది, కానీ అది కనిపించలేదు.

మళ్ళీ పిల్లిని చూస్తానో లేదో అని ఆమె డిసప్పాయింట్ అయింది.

Telugu Feet Fall, Cat Rescued, Cornwall Rescue, Daisy Dog, Dog Finds Cat, Englan

ఆ క్రమంలోనే ఆమె ఒక వింతను గమనించింది.డైసీ డాగ్( Daisy Dog ) హారోబారోలోని వారి ఇంటి సమీపంలోని అడవుల్లోకి, బయటికి పరిగెత్తుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నించింది.రోజ్ డైసీని ఫాలో కావాలని నిర్ణయించుకుంది, అప్పుడు కుక్క ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఓల్డ్ మైన్ వర్కింగ్స్ వైపు ఫుట్‌పాత్‌లో ఆమెను తీసుకెళ్ళింది.అలా తీసుకెళ్తూ డైసీ అకస్మాత్తుగా ఒక మైన్ షాఫ్ట్ పక్కన ఆగి, బిగ్గరగా మొరిగింది.”డైసీ ఒక సూపర్ స్టార్; ఆమె అద్భుతమైన కుక్క.డైసీ పిల్లని గుర్తించి నాకు తెలియ చేయకపోతే, మోగ్లీ ఇంకా అక్కడే ఉండిపోయేది” అని రోజ్ చెప్పింది. రోజ్ మైన్‌షాఫ్ట్ కిందకి చూసింది, లోపల చిక్కుకున్న మోగ్లీని చూసింది.

వెంటనే సహాయం కోసం కార్న్‌వాల్ ఫైర్ అండ్ రెస్క్యూకి కాల్ చేసింది.

Telugu Feet Fall, Cat Rescued, Cornwall Rescue, Daisy Dog, Dog Finds Cat, Englan

అయితే, ఆ రాత్రి మోగ్లీని రక్షించడానికి చాలా చీకటిగా ఉంది, కాబట్టి వారు మరుసటి రోజు ఉదయం వరకు వేచి ఉండవలసి వచ్చింది.RSPCA యానిమల్ రెస్క్యూ ఆఫీసర్, స్టీఫెన్ ఫైండ్‌లో, అతని బృందం ఆశ్చర్యకరంగా క్షేమంగా ఉన్న మోగ్లీని గుర్తించి, దానిని సురక్షితంగా లాగారు. డైసీ వీరోచిత చర్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ భయంకరమైన ప్రమాదం నుంచి బయటపడిన తన ప్రియమైన పిల్లితో తిరిగి కలుసుకున్నందుకు రోజ్ చాలా సంతోషించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube