Girl Stomach : బాలికకు స్కానింగ్ చేసి ఆశ్చర్యపోయిన వైద్యులు.. కడుపులో ఏముందంటే..

సాధారణంగా చిన్న పిల్లలు చాక్‌పీస్‌లు, మట్టి, ఇంకా తినకూడనివి ఎవరికీ తెలియకుండా కడుపులో వేసుకుంటుంటారు.

అయితే ఇదే అలవాటు మరీ ఎక్కువగా ఉంటే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది.

కాగా తాజాగా ఒక బాలిక అలాంటి చెత్త అలవాటుతో హాస్పిటల్ వరకు తెచ్చుకుంది.వివరాల్లోకి వెళ్తే.

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నివసిస్తున్న ఒక 14 ఏళ్ల బాలిక గత ఐదు సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండా వెంట్రుకలను తింటోంది.అలా తిని, తిని ఆమె కడుపులో ఒక గడ్డ లాగా వెంట్రుకల కుప్ప తయారయ్యింది.

దీనివల్ల రీసెంట్‌గా ఆ బాలికకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది.దాంతో బాలిక తల్లడిల్లింది.

Advertisement

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆనంద్‌ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.అక్కడి డాక్టర్లు అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయగా.

బాలిక కడుపులో వెంట్రుకలు పెద్ద కుప్పగా ఉన్నట్లు తేలింది.దాంతో డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి ఆ వెంట్రుకలను తొలగించారు.

కాగా బాలిక ఇప్పుడు త్వరగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు.వెంట్రుకలు తినే అలవాటు, కోరిక ఆ బాలికలకు ఎక్కువ ఎందుకయ్యాయో డాక్టర్లు వివరించలేదు.

కాకపోతే ఇలాంటి రెండు మూడు కేసులు తాము డీల్ చేసినట్లు వెల్లడించారు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

సాధారణంగా ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత ఉన్నవారు వెంట్రుకలను మింగుతుంటారు.బహుశా ఈ అమ్మాయి కూడా అదే సమస్యతో బాధపడుతుందేమోనని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.ఏదేమైనా ఈ డేంజరస్ అలవాటును మాన్పించడం తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత.

Advertisement

తాజా వార్తలు