హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఒక కుక్క వల్ల డెలివరీ బాయ్ ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది.కుక్కను చూసి భయపడ్డ సదరు డెలివరీ బాయ్ మూడో అంతస్తు పైనుంచి దూకేశాడు.
వివరాల్లోకి వెళ్తే.యూసుఫ్‌గూడ నివాసి అయిన 23 ఏళ్ల మహ్మద్ రిజ్వాన్ గత మూడు సంవత్సరాలుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తున్నాడు.
అయితే గురువారం రాత్రి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్‌లో ఒక ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు.ఆ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు మూడో అంతస్తు పైకి ఎక్కాడు.
ఆర్డర్ ఇచ్చిన వారి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు.అయితే అక్కడే ఉన్న ఆ ఇంటి జర్మన్ షపర్డ్ కుక్క చాలా గట్టిగా మోరుగుతూ అతడి మీదకు వచ్చేసింది.

దాన్ని చూడగానే బాగా భయపడి పోయిన రిజ్వాన్ దాని నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో స్పీడ్ గా ఉరికాడు.ఈ క్రమంలోనే అతడు మూడవ అంతస్తు పై నుంచి పొరపాటున దూకేశాడు.అంత ఎత్తు నుంచి పడిన అతడికి తీవ్ర గాయాలయ్యాయి.దీనిని గమనించిన యజమాని వెంటనే ఆ డెలివరీ బాయ్‌ని ఆసుపత్రికి తరలించాడు.కాగా ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఈ సంఘటన జరగడానికి యజమానిని నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ డెలివరీ బాయ్ సోదరుడు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు.

బంజారాహిల్స్ పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కుక్క ఓనర్‌పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు మొదలుపెట్టారు.డెలివరీ బాయ్ వస్తాడని తెలిసినప్పుడు తమ కుక్కను కట్టేసుకోవాలి.లేదంటే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత యజమానికి ఉంది.కానీ అతడు ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.వారిలో కొందరు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రిజ్వాన్ వైద్య ఖర్చులన్నీ కుక్క యజమానే భరించాలని డిమాండ్ చేస్తున్నారు.







