కదల్లేని స్థితిలో జింక.. ప్రాణాలకు తెగించి కాపాడారు..

ఏవైనా అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను కాపాడడానికి చాలా మంది వెనుకంజ వేస్తుంటారు.అందులోనూ మూగజీవులు ప్రమాదంలో ఉంటే పోనీలే అని వదిలేసి వెళ్లిపోతారు.

 The Deer Was Immobilized , Viral News, Latest News , Viral Video , Deer-TeluguStop.com

అయితే తమకు సమాచారం ఇస్తే అగ్నిమాపక సిబ్బంది( Firefighters ) అక్కడకు చేరుకుంటారు.మంటలను ఆర్పడంతో పాటు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలను కాపాడుతుంటారు.

ఇలా ఆపదలో ఉన్న వారిని కాపాడుతూ అగ్నిమాపక సిబ్బంది ప్రశంసలు అందుకుంటారు.ఇదే కోవకు చెందిన హృదయాన్ని హత్తుకునే ఓ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది.

వీడియోలో, మంచు సరస్సులో చిక్కుకున్న జింకను రక్షించడానికి అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టడం కనిపిస్తుంది.ఈ కారణంగానే ఈ అగ్నిమాపక సిబ్బంది నోరు లేని ఓ మూగజీవిని కాపాడి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.

సోషల్ మీడియా( Social media ) ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సిటీ ఆఫ్ ప్రయర్ లేక్ అనే ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.అమెరికాలోని మిన్నెసోటాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఈ ప్రాంతంలో విపరీతమైన చలి కారణంగా ప్రియర్ సరస్సులో మంచు గడ్డకట్టింది.మంచుతో నిండిన ఈ సరస్సులో ఒక జింక( Deer ) చిక్కుకుంది.బయటకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది.అయితే ఎన్నో ప్రయత్నాలు చేసినా దాని నుండి బయటపడలేకపోయింది.

జింక చిక్కుకుపోయిందన్న సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది మంచుపై జాగ్రత్తగా పాకుతూ జింక వద్దకు చేరుకున్నారు.దానిని చాలా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు.అలా జింక ప్రాణాలను కాపాడారు.

ఈ రెస్క్యూ సమయంలో ఏ చిన్న తప్పిదం జరిగినా, ఆ అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.అయినప్పటికీ వారు వెనుకడుగు వేయలేదు.

ఎంతో క్లిష్టమైన రెస్క్యూను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్( Viral ) అవుతోంది.

అక్కడి అగ్నిమాపక సిబ్బంది శాఖను పీఎల్‌ఎఫ్‌డీగా పిలుస్తారు.వారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube