కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీలు ఖరారు అయ్యాయి.ఈ మేరకు పార్లమెంట్ వేదికగా ఈనెల 8, 9 మరియు 10 వ తేదీల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టనున్నారని సమాచారం.
ఈనెల 10న అవిశ్వాస తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు.అయితే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై లోక్ సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ సమర్పించిన అవిశ్వాస తీర్మానానికి ఇప్పటికే లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు.కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్నాయి.
ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ఇండియా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే కేంద్రంపై ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు.