తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. ఎన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారంటే..!

తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు,అభిషేకాలు నిర్వహిస్తారు.అందుకోసం ఈ పుణ్యక్షేత్రంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది.

తిరుమలలో సాధారణ సమయం కంటే ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.రెండు రోజులుగా తిరుమల కొండకు భక్తులు భారీగా క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని( Vaikuntham C Complex ) కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనం లోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి.టీటీడీ కూడా భక్తులకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తుంది.

Advertisement
The Crowd Of Devotees Has Increased In Tirumala In How Many Compartments Are The

వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగిసిన తర్వాత సర్వదర్శనం భక్తులకు వేగంగా దర్శనం పూర్తయ్యలా చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే తిరుమలలో అద్దె గదులకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

శ్రీవారి దేవాలయం తో పాటు అన్నప్రసాద భవనం, లడ్డు వితరణ కేంద్రం, మాడ వీధులు, రోడ్లు, అఖిలాండం, బస్టాండ్, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తులతో రద్దీగా ఉంది.

The Crowd Of Devotees Has Increased In Tirumala In How Many Compartments Are The

కాలి నడక మార్గంలో భక్తులు భారీగా కనిపిస్తున్నారు.శుక్రవారం రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.శుక్రవారం రోజు శ్రీవారిని దాదాపు 82,000 మంది భక్తులు దర్శించుకున్నారు.తెలంగాణలోని కరీంనగర్ లో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం( TTD Sri Venkateswara Swamy Temple ) నిర్మించనుంది.31వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగనుంది.తెలంగాణ మంత్రి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ( Vinod Kumar )టీటీడీ ఈవో ధర్మారెడ్డితో సమావేశం అయ్యారు.

దేవాలయ నిర్మాణానికి టీటీడీకి పది ఎకరాల భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గురించి వారు వెల్లడించారు.

The Crowd Of Devotees Has Increased In Tirumala In How Many Compartments Are The
నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

కరీంనగర్ ప్రజలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.ఈ నెల 31వ తేదీ భూమి పూజ ముగిశాక అదే ప్రాంగణంలో సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని చేస్తామని మంత్రి వెల్లడించారు.తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులకు, సిబ్బందికి అవసరమైన వసతి సమకూరుస్తామని కూడా వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు