సమోసా ఖరీదు రూ.490.. బిల్లు చూసి షాక్

మాల్స్‌, సినిమా హాళ్లు లేదా ఎయిర్‌పోర్టుల్లో ఏవైనా స్నాక్స్‌, టీ వంటివి తీసుకోవాలంటే సామాన్యులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే.

ఎందుకంటే ఆ ప్రదేశాల్లో ధరలు భారీగా ఉంటాయి.

బయట తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాలు కూడా ఇలాంటి చోట చాలా ఖరీదుకు అమ్ముతూ ఉంటారు.ప్రస్తుతం ఒక ఎయిర్‌పోర్ట్‌ ఫుడ్ బిల్లు( Airport food bill ) ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇందలో టీ, సమోసాకు ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

1 టీ, రెండు సమోసాలు, ఒక వాటర్ బాటిల్ ధర రూ.490గా ఈ బిల్లులో ఉంది.ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ బిల్లు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Advertisement

ఒక వ్యక్తి ఈ బిల్లును కాఫీ మైక్రోబ్లాగింగ్ సైట్( microblogging site ) లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.అందలో అతను ఆవేదనకు గురయ్యాడు.ముంబై నుంచి కోల్‌కతాకు విమాన టికెట్ రూ.9,230గా ఉందని, క్యాబ్ డ్రైవర్ రూ.1500 తీసుకున్నాడని పేర్కొన్నాడు.ఒకసారి ఇంటికి చేరుకోవడానికి మొత్తం ఖర్చు రూ.11,220 అయిందని చెప్పుకొచ్చాడు.తన నెల జీతం జీతం రూ.17,000 అని చెప్పాడు.తన సంపాదనపై ఆధారపడిన కుటుంబం 100 కోట్ల జనాభాలో హిందువులలో తాను ఒకడినిని, హిందువులు నిజంగా ప్రమాదంలో ఉన్నారంటూ వివాదాస్పదంగా రాసుకొచ్చాడు.

సోషల్ మీడియాలో ఈ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.ఇప్పటివరకు దాదాపు ఎనిమిదిన్నర వేలకు పైగా లైక్‌లు రాగా.10లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.అలాగే నెటిజన్లు రకారకాలుగా తమ అ భిప్రాయాలు చెబుతున్నారు.

ఆర్థిక స్తోమత లేనప్పుడు విమానాల్లో వెళ్లడం ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.అయితే ఈ వార్త పాతదని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతోందని చెప్పవచ్చు.దీంతో ఇది వివాదాస్పదంగా మాిరంది.

బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..
Advertisement

తాజా వార్తలు