అక్కడ ఒక్కో గొర్రె ధర లగ్జరీ కారు కంటే ఎక్కువే.. ఎందుకంటే..

సాధారణంగా గొర్రెలు వేలల్లోనే ధర పలుకుతుంటాయి.కానీ ఒక దేశంలో మాత్రం రూ.8 లక్షల నుంచి రూ.65 లక్షల వరకు ధర పలుకుతున్నాయి.ఆ దేశం పేరు సెనెగల్.ఆఫ్రికాలో ఉండే ఈ దేశంలో గొర్రెలను ఉన్ని కోసమో, మాంసం కోసమో పెంచరు.వాటిని కేవలం పెంపుడు జంతువులుగా మాత్రమే పెంచుతుంటారు.అంతేకాదు వీటికి అందాల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.

 The Cost Of Each Sheep There Is More Than A Luxury Car. Because Ladoum Breed She-TeluguStop.com

కరోనా సమయంలో ఫొటోగ్రాఫర్ సిల్వైన్ చెర్కౌయ్ లాడౌమ్ అని పిలిచే ఈ ప్రత్యేకమైన గొర్రెల గురించి తొలిసారిగా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.తర్వాత వాటి గురించి ప్రపంచానికి తెలియజేశాడు.

అతని ప్రకారం, ఈ ప్రాంతంలోని గొర్రెలు చాలా పొడవుగా, గంభీరంగా ఉంటాయి.వీటిని ఒక్క ఈద్ అల్ ఫితర్ సందర్భంగా మాత్రమే అల్లాహ్‌ కోసం బలి ఇస్తారు.

అలా వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. 1970 కాలంలో మౌరిటానియన్, మాలియన్ జాతి గొర్రెలు కలిసినప్పుడు ఈ లాడౌమ్ అనే హైబ్రీడ్ గొర్రె జాతి పుట్టుకొచ్చింది.

హైబ్రిడ్ జాతి గొర్రెలు పొడుగ్గా, కండలు తిరిగిన శరీరంతో చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి.వీటి వంగిన కొమ్ములు కూడా అందాన్ని పెంచేస్తాయి.

వీటిలో ఒక్కో గొర్రె 180 కిలోల వరకు పెరుగుతుంది.అలానే ఇవి నాలుగు అడుగుల ఎత్తు ఉంటాయి.

ఈ ప్రత్యేకమైన గొర్రెలకు ప్రపంచవ్యాప్తంగా సూపర్ డిమాండ్ ఉండటం వల్ల వీటి ధర 10 వేల డాలర్ల నుంచి కొన్నిసార్లు 80 వేల డాలర్ల వరకు పలకడం విశేషం.ఈ డబ్బులతో బడ్జెట్ కారు నుంచి లగ్జరీ కారు వరకు కొనుగోలు చేయొచ్చు.

Telugu Senegal Sheeps-Latest News - Telugu

ఇదిలా ఉండగా.సెనెగల్ దేశ ప్రజలు తమ గొర్రెలను ఏటా అందాల పోటీలకు పంపిస్తారు.ఈ పోటీలు టీవీలో కూడా టెలికాస్ట్ అవ్వడం విశేషం.ఇక గెలిచిన గొర్రెకు ఫుడ్, క్యాష్ తదితరవి బహుమతిగా అందజేస్తారట.ఏదేమైనా ఈ గొర్రెల గురించి మెడిసిన్లు తెలుసుకొని చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube