Dyson Zone Headset : ఆ కంపెనీ నుంచి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్‌తో హెడ్‌సెట్ లాంచ్..

హెడ్‌సెట్ వల్ల చాలానే ఉపయోగాలు ఉన్నాయి.ఆడియో, వీడియో కంటెంట్‌లో లీనమయ్యే అనుభూతిని హెడ్‌సెట్ మాత్రమే అందించగలదు.

 The Company Launched A Headset With Advanced Features , Dyson Headset , New Head-TeluguStop.com

అలానే పక్కవారికి ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా కాల్స్ మాట్లాడుకోవడం, పాటలు వినడం, సినిమాలు చూడటం వంటి పనులకు ఈ హెడ్‌సెట్ బాగా ఉపయోగపడుతుంది.అయితే ఇప్పటివరకు ఏ కంపెనీ తీసుకురాని హెడ్‌సెట్‌ను తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారుదారు డైసన్ తీసుకొచ్చింది.

ఈ కంపెనీ తన కొత్త హెడ్‌సెట్‌కు ఎయిర్ ప్యూరిఫైయర్‌ను అందించింది.

ఈ హెడ్‌సెట్‌ అమ్మకాలను 2023, జనవరి నుంచి చైనాలో ప్రారంభించనుంది.

తర్వాత యూఎస్, యూకే, ఐర్లాండ్, హాంగ్ కాంగ్, సింగపూర్ దేశాల్లో అమ్మకాలు ప్రారంభిస్తుంది.ఈ డైసన్ జోన్ హెడ్‌సెట్ ధరను 949 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ.78 వేలు.ఇందులో ఇంత ధర పెట్టడానికి ఏం కారణం ఇది మరిన్ని అధినాతన ఫీచర్లతో రావడమే అని చెప్పొచ్చు.దీనిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ అందించారు.

Telugu Air Purifier, Dyson Headset, Headset, Tech-Latest News - Telugu

అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల ఢిల్లీ, హైదరాబాద్ వంటి కాలుష్యం ఎక్కువ గల సిటీలలో రక్షణ పొందవచ్చు.హెడ్‌సెట్‌కు ఫ్రంట్ సైడ్‌లో ముక్కు, నోరు కవర్ అయ్యేలా ఒక డైసన్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంటుంది.దీనిని ధరించడం ద్వారా ఆ ప్యూరిఫైయర్ అనేది ధరించిన వారి ముక్కులోకి ఫిల్టర్ చేసిన గాలిని పంపిస్తుంది.అలా వాయి కాలుష్యం నుంచి యూజర్లు రక్షణ పొందొచ్చు.

ఇంకా ప్రీమియం హెడ్‌సెట్‌ లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఇంత డబ్బులు పెట్టి దీనిని ఎవరు కొనుగోలు చేస్తారో చూడాలిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube