CM JAGAN YS Vivekananda Reddy : ముఖ్యమంత్రి సిగ్గు పడాలి!

సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు ఆంధ్రప్రదేశ్ లో నిజాయితీ గా జరగడం లేదని దర్యాప్తును సుప్రీంకోర్టు పక్క రాష్ట్రం తెలంగాణకు బదిలీ చేసినందుకు ముఖ్యమంత్రిగా వున్న జగన్ మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి.ఇంతకన్నాఅవమానం,అప్రతిష్ట ఏమి కావాలి? మరొకరి కేసు విచారణ అయితే పర్వాలేదు.సొంత బాబాయిని హత్య కేసు విచారణ నిజాయితీ గా జరగడంలేదని మరొక రాష్ట్రానికి మార్చడం ఎంత పరువు నష్టం? బాధితులకు అండగా ఉండాల్సిన ముఖ్యమంత్రి,పోలీసులు హంతకులకు అండగా నిలిచినందుకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు.తన తండ్రి వివేకా హత్య కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది.

 The Chief Minister Should Be Ashamed , Chief Minister , Cm Jagan , Ys Vivekanand-TeluguStop.com

జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణకు బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చింది.ఈ నేపథ్యంలోనే కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది.

వివేకా కుమార్తె సునీతకు,భార్యకు కేసు విచారణ నిజాయితీగా జరగడం లేదని అసంతృప్తి ఉన్నందున మరొక రాష్ట్రానికి విచారణ బదిలీకి ఆదేసించినట్లు సుప్రీం కోర్టు తెలిపింది.ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఈ కేసులో సాక్ష్యాలను చెరిపేసిన ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలపడం, ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం,రాష్ట్రంలో చట్ట బద్ద పాలనలేదని,ప్రభుత్వం,పోలీసులు కుమ్మక్కై ప్రాధమిక హక్కులు కాలరాస్తున్నారని చెప్పడానికి సుప్రీం కోర్టు తీర్పే నిదర్శనం అని చెప్పాలి.కేసులోని వాస్తవాలు పరిగణంలోకి తీసుకొంటే విచారణ నిజాయితీగా ,స్వతంత్రంగా జరిగే అవకాశం లేదని సుప్రీంకోర్టు చెప్పడం అంటే కేసు విచారణ ఎంత అద్వాన్నంగా ఉందొ సుప్రీం కోర్టు తీర్పు అద్దం పట్టింది.

Telugu Andhra Pradesh, Ap, Cbi Ram Singh, Cid Amit Garg, Cm Jagan, Kadapasp, Sun

సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్రంలో ఎంత అరాచక,అద్వాన్న పాలన సాగుతుందో దేశమంతటికీ తెలిసిపోయింది.వివేకా హత్యకేసులో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వల్ల రాష్ట్రం పరువు జాతీయ స్థాయిలో మంట కలిసింది.మొదట వివేకానందరెడ్డిని గొడ్డలితో హత్యచేసి గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేశారు.తర్వాత ఆధారాలు ధ్వసం చేశారు.అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో సిఐడి విభాగాధిపతి అమిత్ గార్గ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చెయ్యడం జరిగింది.కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా వున్న జగన్ రెడ్డి నాకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై నమ్మకం లేదని,ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేశారు.2019 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదట కడప ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో దర్యాప్తు సాగింది.తర్వాత ఆయన పై వత్తిళ్లు అధిక మవ్వడంతో ఆయన ఆ పోస్టు నుంచి రిలీవ్ అవ్వాల్సి వచ్చిoది.

తర్వాత కేసు ముందుకు సాగక పోగా అసలైన హంతకులను పక్కకు తప్పించే ప్రయత్నం జరిగింది.తర్వాత వివేకా కుమార్తె ఈ వ్యవహారం పై సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయ్యగా,జగన్ ప్రభుత్వం సీబీఐ విచారణ అక్కరలేదని అఫిడవిట్ దాఖలు చేసింది.

అయినా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.అప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల నుంచి సిబిఐ ఆటంకాలు ఎదురు అయ్యాయి.సీబీఐ ని ముప్పు తిప్పలు పెట్టారు.దేశంలోనే అత్యున్నత నేర పరిశోధన సంస్థ అయిన సీబీఐ అత్యంత చేదు అనుభవాలు ఎదుర్కొన్నది.

దర్యాపు చేస్తున్న సీబీఐ అధికారులనే బెదిరించారు అంటే రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది.రాష్ట్ర పోలీసులకు క్లిష్టమైన కేసుల దర్యాప్తును సీబీఐ కి అప్పగిస్తారు.

కానీ ఆ సీబీఐ పైనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు పెట్టడం,సాక్షులకు,దర్యాప్తు అధికారులకు రక్షణ కల్పించలేని స్థితికి దిగజారడం పోలీసు వ్యవస్థకి ఎంత అప్రతిష్ట.

Telugu Andhra Pradesh, Ap, Cbi Ram Singh, Cid Amit Garg, Cm Jagan, Kadapasp, Sun

ఒకప్పుడు ఆంద్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి దేశ వ్యాప్తంగా గొప్ప బ్రాండ్ ఉండేది.శాంతి భద్రతలు కాపాడటం,నేర నియంత్రణం,మావో యిష్టుల కార్యకలాపాలు అణచి వెయ్యడం వంటి విషయంలో మంచి పేరు ప్రఖ్యాతులు వున్నాయి.కానీ మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ఆడమన్నట్లు ఆడి అప్రదిష్ట మూటకట్టుకున్నారు.

ఇప్పుడు వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సుప్రీంకోర్టు తీర్పుతో జాతీయ స్థాయిలో పోలీసు వ్యవస్థ పరువు మంటకలిసింది.పోలీసులు వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కి సహకరించక పోగా అనుమానితుడు పిర్యాదు ఇచ్చారని సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు పెట్టడానికి కూడా వెనకాడలేదు.

ఆ మధ్య విశ్రాంత పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నేను 30 ఏళ్ళు పనిచేసాను,ఆంధ్రప్రదేశ్ పోలీసులమని గొప్పగా చెప్పుకొనేవాళ్ళం.నేడు అధికారపక్షానికి ఈ విధంగా కొమ్ముకాయడం,నిందితులకు అండగా నిలవడం,సీబీఐ అధికారి పైనే కేసులు నమోదు చెయ్యడం,సాక్షులకు రక్షణ కల్పించలేకపోవడం వంటి ఘటనలు చూసి పోలీసు వ్యవస్థ ఇంతగా జాగారాలా?నేను పని చేసిన పోలీస్ వ్యవస్థే నా అన్నారు.ఏది ఏమైనా వివేకా హత్య కేసు విచారణ అది కూడా ముఖ్యమంత్రి సొంత బాబాయి హత్య కేసు విచారణ నిజాయితీగా జరగడంలేదని పక్క రాష్ట్రం తెలంగాణకు మార్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.మరొక ముఖ్యమంత్రి అయితే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube