దేశ వ్యాప్తంగా నగరాల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.ఈ క్రమంలోనే దేశంలోని నాలుగు నగరాలను గ్రోత్ హబ్స్ గా మార్చాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
అయితే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంచుకున్న ఏకైక నగరంగా ఏపీలోని విశాఖపట్నం నిలిచింది.మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసి ఫైలట్ నగరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేసింది.
నీతి ఆయోగ్ ద్వారా సిటీ లెడ్ డెవలప్ మెంట్ జరపాలన్నదే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ తెలిపారు.