టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు అరెస్ట్ కావడంతో న్యాయం, ధర్మం గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీగ మాత్రమేనన్న మాజీమంత్రి పేర్ని నాని డొంక కదులుతుందని చెప్పారు.సీఐడీ నుంచి చంద్రబాబుకు ముందే సమాచారం ఉందన్నారు.
రెండు రోజుల ముందే తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబు చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు.చంద్రబాబు ఎన్నో స్కామ్ లకు పాల్పడ్డారన్న పేర్ని నాని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూ.371 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.అధికారులపై చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
కానీ సీఐడీ అధికారులు మాత్రం ఎంతో సంయమనంతో వ్యవహారించారని తెలిపారు.అవినీతికి పాల్పడిన చంద్రబాబును కాపాడేందుకు పవన్, పురంధేశ్వరి పని చేస్తున్నారని విమర్శించారు.







