తెలంగాణలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారాన్ని ముగించారు.
ఈ మేరకు రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.చెన్నూరు, సిర్పూర్, బెల్లంపల్లి, మంథని, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, అశ్వరావుపేట, ఇల్లందు, మంచిర్యాల, పినపాకతో పాటు భద్రాచలం నియోజకవర్గాల్లో ప్రచారం ముగిసింది.
కాగా మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పార్టీలు ప్రచారాలను ముగించనున్నాయి.ఈ క్రమంలోనే 5 గంటల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి రానుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
అయితే ఎల్లుండి పోలింగ్ జరగనుండగా ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.







