ఓ వివాహ వేడుకలో వివాహం జరగడానికి కొన్ని క్షణాల ముందు పోలీసులు ఎంట్రీ ఇచ్చి వరుడిని అరెస్టు చేయడంతో.వరుడు, వధువు కుటుంబ సభ్యుల మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
వివాహ వేడుకకు వచ్చిన బంధువులు నచ్చజెప్పడంతో వరుడి సోదరుడిని ( Groom’s brother )వధువు పెళ్లాడింది.ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆలీగడ్ జిల్లాలో ( Aligarh district of Uttar Pradesh )చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.అలీగడ్ లోని ఓ మద్యం షాపులో మద్యం సీసాలు ఉన్న 35 డబ్బాలు, ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి.షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని అన్నీ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
సంఘటన స్థలంలో ఒక బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి ఆధారంగా దర్యాప్తు చెయ్యగా ఫైజల్( Faisal ) అనే యువకుడు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.

మరోవైపు పైజల్ వివాహం జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు పెళ్లి జరగడానికి కొద్ది క్షణాల ముందు ఎంట్రీ ఇచ్చి చోరీ కేసులో ఫైజల్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.దీంతో పెళ్లి ఆగిపోయింది.ఫైజల్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లారు.
పోలీసుల విచారణలో తాను చోరీ చేసినట్లు ఫైజల్ అంగీకరించాడు.దీంతో వధువు వివాహం ఆగడంతో బంధువులు గొడవకు దిగడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
వరుడి సోదరుడు వధువును వివాహం చేసుకునేందుకు ముందుకు రావడంతో ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.చివరికి వరుడు సోదరుడికి వధువుకి వివాహం జరిపించారు.







