మండపేట: రెండు పాములు మసకలాడుకుంటూ చూపరులను హల్ చల్ చేశాయి.పట్టణంలోని గాంధీనగర్ శివారు ప్రాంతమైన ఐ ఆర్ కే లే అవుట్ లలో కనిపించిన ఈ దృశ్యం సినిమాలో మాదిరిగా కనిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
ఒక దానితో ఒకటి పెన వేసుకుని సుమారు 20 నిమిషాల పాటు ఈ క్రీడను కొనసాగించాయి.ఆ సమయంలో అక్కడే ఉన్న ఎన్ వి న్యూస్ ఈ దృశ్యాన్ని చిత్రీకరించింది.
పచ్చని పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన పాముల మసకలాట చెప్పుకోవడమే తప్ప స్వయంగా చూసేవారు అరుదుగా ఉంటారు.అనేక మంది చూసి ఆశ్చర్యచకితులయ్యారు.