ప్రమాదకర మిస్సైల్స్‌ అని తెలియక ఇంట్లో పెట్టుకున్నారు.. 1980 నుండి వాటిని తెగ వాడేశారు

అఫ్ఘానిస్తాన్‌లో ఎప్పుడు కూడా యుద్దం, బాంబులు, రక్త పాతం జరుగుతూనే ఉంటుంది.అక్కడ శాంతి భద్రతలు అనేవి చాలా రేర్‌గా ఉంటాయి.

శాంతి భద్రతలు కరువైన అఫ్ఘానిస్తాన్‌లోని ఒక గ్రామం ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.ఎందుకంటే వారు దాదాపు 40 ఏళ్లుగా అత్యంత ప్రమాదకరమైన మిస్సైల్స్‌ను సిల్లీ కారణాల కోసం వాడుకున్నారు.

ఆ మిస్సైల్స్‌లో ఒక్కటి పేలినా కూడా ఆ ఊరు మొత్తం బ్లాస్ట్‌ అయ్యేది.అంత ప్రమాదకర వాటిని వారు ఎందుకు వాడారో తెలుసా.

ఎందుకంటే అవి ప్రమాదకరమైనవి అనే విషయం వారికి తెలియదు.ఆ ఊరు మొత్తం కూడా 400లకు పైగా క్షిపణులతో నిండి పోయింది.

Advertisement

ఆ క్షిపణులను వారు ఇంటి పై కప్పు కోసం, గోడల్లో దూలాల కోసం, ఇంకా రకరకాల సిల్లీ కారణాలకు వాడారు.అయితే ఈ 40 ఏళ్లలో ఆ 400 వందల క్షిపణుల్లో ఒక్కటి పేలినా కూడా గ్రామం అంతా కూడా కనిపించకుండా పోయేది.

ఎందుకంటే ఒక్కటి పేలితే మిగిలినవి కూడా యాక్టివేట్‌ అయ్యి పేలిపోయేవి.

తాజాగా ఒక సంస్థ ఆ గ్రామంలోకి వెళ్లిన సమయంలో క్షిపణుల గురించి తెలుసుకుంది.ఆ క్షిపణుల గురించి ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు వాటిని గమనించి అవి నిర్వీర్యం కానివని, వెంటనే వాటిని నిర్వీర్యం చేయాలంటూ నిర్ణయించింది.ఆ విషయం తెలిసిన గ్రామస్తులు కళ్లు తిరిగి పడిపోయినంత పని అయ్యింది.

ఇన్నాళ్లు మేము అత్యంత ప్రమాదకరమైన బాంబులను ఇలాంటి సిల్లీ కారణాల కోసం వాడుతున్నామా అనుకున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఆక్కడ దాదాపు అన్ని ఇల్లలో కూడా క్షిపణులు ఉన్నాయి.ఒక ఇంట్లో ఏకంగా 26 రాకెట్‌ క్షిపణులు ఉన్నాయి.వారు ఇంటి పైకప్పు కోసం, దర్వాజ ఇంకా రకరకాల కారణాలతో వాడుతూ వచ్చారు.

Advertisement

ఆ క్షిపణులు ఎలా వచ్చాయని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.1980వ సంవత్సరంలో యుద్దం జరిగింది.యుద్దం ముగిసిన తర్వాత సోవియేట్‌ యూనియన్‌ అక్కడే వదిలేసి వెళ్లారు.వాటి గురించి గ్రామస్థులకు అవగాహణ లేకపోవడంతో వాటిని ఇష్టం వచ్చినట్లుగా వాడేశారు.

విషయం తెలిసిన తర్వాత వారు గజగజ వణికి పోయారు.వాటన్నింటికి తొలగించి నిర్వీర్యం చేశారు.

ఒక నిర్మాణుష ప్రాంతంకు తీసుకు వెళ్లి పేళ్లారు.పేళిన సమయంలో రెండు మూడు కిలోమీటర్ల మేరకు భూమి కంపించిందట.

తాజా వార్తలు