తెలుగులో నెక్స్ట్ సినిమా కమిట్ అయిన హీరో కార్తి! ఆ దర్శకుడు తోనే!

సౌత్ ఇండియాలో తమిళ హీరోలలో సూర్య, కార్తి, విశాల్, విజయ్, అజిత్ లాంటి స్టార్స్ కి మంచి మార్కెట్ వుంది.

వారు హీరోలుగా తెరకెక్కిన తమిళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ హిట్ అవుతూ వుంటాయి.

ఈ కారణంగానే వారి ప్రతి సినిమాని తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే సారి రిలీజ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటారు.ఇక తెలుగు లో హీరో సూర్యకి ప్రస్తుతం వున్న హీరోలలో అందరి కంటే ఎక్కువ మార్కెట్ వుంది.

ఇక సూర్య తమ్ముడు కార్తికి కూడా తెలుగులో మంచి ఇమేజ్ వుంది.ఇక కార్తి గతంలో నాగార్జునతో కలిసి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి అనే సినిమాలో నటించాడు.

ఈ సినిమా అతని కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.ప్రస్తుతం కార్తి హీరోగా దేవ్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Advertisement

ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా ఎవరేజ్ టాక్ తో నడుస్తుంది.దీని తర్వాత కార్తి తెలుగులో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

టాలీవుడ్ లో విభిన్న చిత్రాల దర్శకుడుగా తనకంటూ పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో కార్తి తన సెకండ్ తెలుగు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.దర్శకుడు చంద్రశేఖర్ ఇప్పటికే కార్తికి రెండు కథలు నేరేట్ చేయడం జరిగింది అని తెలుస్తుంది.

కార్తికి రెండు స్క్రిప్ట్ నచ్చాయని వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకొని సినిమా స్టార్ట్ చేసే అవకాశం వుందని తెలుస్తుంది.ఇక చంద్రశేఖర్ అంటేనే డిఫరెంట్ కథనంతో సినిమాలు వుంటాయి.

మరి కార్తి హీరోగా తెరకెక్కే ఈ సినిమా ఎ జోనర్ లో ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు