సినిమా ఇండస్ట్రీ లో ఉన్నచాలా మంది నటులలో జోష్ రవి( Josh Ravi ) ఒకరు ఈయన జోష్ అనే సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా తో ఆయన పేరు జోష్ రవి గా పాపులర్ అయింది.ఇక ఆ తర్వాత ఖలేజా సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు.
ఇక ఇప్పుడు చాలా సినిమాల్లో ఆయన మంచి క్యారెక్టర్ లు చేస్తూ ఇండస్ట్రీ లో ఒక మంచి నటుడు గా ముందుకు వెళ్తున్నాడు.ఇక ఈయన కెరియర్ లో ఈయనకి మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమాల్లో గుండెజారి గల్లంతయిందే సినిమా ( Gundejaari Gallanthayinde )ఒకటి ఈ సినిమాతో తనలోని నటుడుని బయటికి తీసిన ఈయన ఈ సినిమాలో కామెడీని చాలా బాగా పండించాడు.
అలాగే పటాస్ సినిమాలో కూడా చేసింది చిన్న పాత్ర అయిన కూడా చాలా బాగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈయన చిరంజీవి, రజినీకాంత్( Chiranjeevi, Rajinikanth ) లను ఇమిటేట్ చేస్తూ చాలా బాగా నటిస్తాడు అందుకే ఈయన కి ఇండస్ట్రీ లో చాలా క్రేజ్ కూడా పెరిగింది.ఇక ఈయన ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీ గా ఉన్నాడు.ఇక ఈ సినిమా ఇండస్ట్రీ లో ఎవరైతే మంచి ఫామ్ లో ఉంటారో వాళ్ళని ఇండస్ట్రీ చాలా వరకు ఆదరిస్తుందనే చెప్పాలి.
ఇక జోష్ రవి ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న గేమ్ చెంజర్ మూవీ ( Game changer movie )లో కూడా ఒక కీలకమైన పాత్ర లో నటిస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన కి ఇండస్ట్రీ లో ఇంకా మంచి గుర్తింపు వస్తుంది అని ఆయన చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తో పాటు ఇంకా కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మంచి బిజీ గా ఉన్నాడు
.