నాతో ఎప్పటికీ తోడున్నది అదే... సమంత పోస్ట్ వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు.ఈమె ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

 Thats What Will Stay With Me Forever Samanthas Post Goes Viral Samantha, Viral-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదలయి 13 సంవత్సరాలు కావడంతో సమంత సినీ కెరియర్ కూడా ప్రారంభమై 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇలా నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది.

తనకు నటన సరిగా రాదని డాన్స్ లు సరిగా రావని పలువురు కామెంట్లు చేసేవారు.

ఇలా తన గురించి ఇలాంటి విమర్శలు వచ్చిన ఎప్పటికప్పుడు తనని మార్చుకుంటూ తనలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతూ వచ్చారు.ఇలా ఒకప్పుడు విమర్శించిన వారి ఇప్పుడు సమంత అద్భుతమైన నటి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక సమంత వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే.

ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం పలు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం వంటివి జరిగింది.ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన కెరీర్ ను బిల్డ్ చేస్తున్న క్రమంలోనే మయోసైటిసిస్ వ్యాధి బారిన పడ్డారు.

ఈ వ్యాధి కారణంగా బెడ్ మీద నుంచి కదలలేని పరిస్థితిలోకి సమంత వెళ్లిపోయారు.అయితే మనోధర్యంతో ఈ వ్యాధిని జయించిన ఈమె ప్రస్తుతం తిరిగి వర్కౌట్లు చేస్తూ షూటింగ్ లొకేషన్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక సమంత ఇండస్ట్రీలోకి వచ్చి 13 సంవత్సరాలు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.దీంతో సమంత పేరు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది.

ఇక ఈ విషయంపై స్పందించిన సమంత అభిమానులు చూపించే ప్రేమను నేను ఫీల్ అవుతున్నాను.నేను ముందుకు వెళ్లేందుకు తోడుంది ఈ ప్రేమనే.

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా నేను నాలానే ఉన్నాను.పదమూడేళ్ల అయ్యాయి.

అసలు ఆట ఇప్పుడే ప్రారంభం అయింది అంటూ ఈమె తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు.ఇలా అప్పటికీ ఇప్పటికీ అభిమానుల ప్రేమే తనని ముందుకు నడిపిస్తుందంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube