అప్పుడప్పుడు హీరోయిన్స్ ఫన్నీ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో అందులో రకరకాల ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కూడిన ఫిల్టర్స్ వస్తున్నాయి.
దీంతో సెలెబ్రెటీలు వెంటనే ఆ ఫిల్టర్స్ తో రకరకాల వీడియోస్, ఫోటోస్ దిగుతూ వెంటనే తమ ఫాలోవర్స్ కు పంచుకుంటున్నారు.అయితే తాజాగా ఒక హీరోయిన్ కూడా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో కూడిన వీడియో పంచుకుంది.
ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ అవ్వగా ఆమె ఎవరో గుర్తు పట్టడం కాస్త కష్టమైంది.అయితే బాగా గమనిస్తే ఆమె ఎవరో కాదు శృతి హాసన్.
భారత నటుడు కమల్ హాసన్ కూతురు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.తన నటనతో మంచి గుర్తింపు అందుకున్న శృతిహాసన్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
నటిగానే కాకుండా సింగర్ గా కూడా తనలో ఉన్న మరో యాంగిల్ ను బయట పెట్టింది.తనకున్న క్రేజ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇక ఈమె 2000 లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.2010లో ‘లక్’ అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయమయ్యింది.ఇక అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
అలా దాదాపు 20 సినిమాలలో నటించింది.తెలుగుతో, హిందీ తో పాటు తమిళ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తానే స్వయంగా పాటలు రాసి కంపోజ్ చేస్తుంది కూడా.బాలీవుడ్ లో కూడా తన పాటను వినిపించింది.
చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇక వ్యక్తిగత విషయంలో శృతి హాసన్ చాలాసార్లు వార్తల్లోకెక్కింది.

అయినా కూడా తాను అవన్నీ పట్టించుకోకుండా తన కెరీర్ పై దృష్టి పెట్టింది.ఇక శృతి హాసన్ ప్రస్తుతం తన బాయ్ ఫ్రెండ్ శాంతా ను హజారికా తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.
నిజానికి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.ఇక తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది.ఇక ఈమధ్య పన్ని ఎక్స్ప్రెషన్స్ తో కూడిన వీడియోస్ కూడా బాగా చేస్తూ ఉంది.
అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకోగా అందులో తన ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించిన ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటో చూసి చాలా మంది శృతిహాసన్ ఫేస్ ఏంటి ఇలా అయింది అంటూ సరదాగా ట్రోల్స్ చేస్తున్నారు.








