జక్కన్న సినిమాలో ఆ స్టార్ హీరో...

ఆర్ ఆర్ ఆర్( RRR ) సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత రాజమౌళి మహేష్ బాబు ( Rajamouli ,Mahesh Babu )కాంబినేషన్ లో వస్తున్న మూవీ మీద జనాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే ఈ సినిమా స్టోరీ ఇది బ్యాక్ డ్రాప్ ఇది అంటూ చాలా రకాల వార్తలు వస్తున్నాయి… అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో మోహన్ లాల్ నటించనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.

 That Star Hero In The Movie Jakanna, Mohan Lal , Jakanna, Rajamouli , Mahesh Ba-TeluguStop.com

మోహన్ లాల్ అంటే జక్కన్నకు ఎంతో అభిమానమని గతంలో తన డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాల కోసం మోహన్ లాల్ కోసం రాజమౌళి సంప్రదించారని బోగట్టా.

అయితే ఆ సమయంలో మోహన్ లాల్( Mohan Lal ) వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల రాజమౌళి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

 That Star Hero In The Movie Jakanna, Mohan Lal , Jakanna, Rajamouli , Mahesh Ba-TeluguStop.com

అయితే మోహన్ లాల్ డేట్స్ కోసం జక్కన్న ఇప్పటినుంచి సంప్రదిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మహేష్ జక్కన్న కాంబో మూవీలో మోహన్ లాల్ కచ్చితంగా నటిస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Telugu Jakanna, Mahesh Babu, Mohan Lal, Rajamouli, Tollywood-Movie

మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ఇతర భాషలకు సంబంధించిన కీలక నటీనటులు కూడా నటిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.మహేష్ జక్కన్న కాంబో మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తుండగా జక్కన్న ఆలోచనలు కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం.ఈ జనరేషన్ ఆడియన్స్ కు కచ్చితంగా నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

Telugu Jakanna, Mahesh Babu, Mohan Lal, Rajamouli, Tollywood-Movie

మహేష్ రాజమౌళి (SSMB 29) కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.ఈ బడ్జెట్ ఒకింత ఎక్కువ మొత్తం అయినా మహేష్ రాజమౌళిని నమ్మి నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube