తెలంగాణలో ఎన్నికలు రోజుల వ్యవది లో ఉండడంతో ఇప్పుడు అన్ని పార్టీలు ప్రచారంపై పూర్తిస్థాయి లో దృష్టి పెట్టాయి .అందుబాటులో ఉన్న ప్రసార సాధనాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూ ప్రజలతో మమేకమవడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
దానిలో భాగంగానే కెసిఆర్ తనయ నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత( Kavitha ) ట్విట్టర్లో ఆస్క్ కవిత( Ask Kavitha ) పేరుతో ఒక చిట్ చాట్ నిర్వహించారు.ఇందులో నేటిజన్లతో అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకొని, వారి ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చారు.
రాష్ట్రంలో హాంగ్ వచ్చే పరిస్థితి ఉందా అన్న ప్రశ్నకు 2018లో కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ప్రయత్నాలే చేశాయని అందులో భాగంగానే అనేక సర్వే ఫలితాలను తీసుకొస్తున్నాయని అయితే టిఆర్ఎస్ మరోసారి సెంచరీ కొట్టి హ్యాట్రిక్ సాధిస్తుందంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బిజెపి తో( BJP ) డీల్ లో ఉన్నారా అన్న ప్రశ్నకు తమకు ఎవరితోనూ జట్టు లేదని, తెలంగాణ ప్రజలు మాత్రమే తమ జట్టు అని ప్రకటించారు , బజాపా తమ రాజకీయ ప్రత్యర్ధి అని స్పష్టం చేశారు.అలాగే రాహుల్ గాంధీ( Rahul Gandhi ) వ్యాఖ్యలపై తన అభిప్రాయం చెబుతూ రాహుల్ గాంధీ కుటుంబం వల్లే తెలంగాణ ఇన్ని ఇబ్బందులు పడిందని , రాహుల్ ముత్తాత నెహ్రూ బలవంతంగా తెలంగాణను ఆంధ్రలో కలపడం వల్ల ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు అనేక అవకాశాలను కోల్పోయారని రాహుల్ నాయనమ్మ ఇందిర హాయములో తెలంగాణ ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నారని , అలాగే రాహుల్ తండ్రి రాజీవ్ అప్పటి తెలంగాణ సీఎం అంజయ్య గారిని అవమానించారని, రాహుల్ తల్లి సోనియా( Sonia Gandhi ) కూడా తెలంగాణ ఇస్తానని 2004 లో మాటిచ్చి ఐదేళ్లపాటు నిశ్శబ్దంగా ఉండిపోయారని,

2014లో తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ఒక్కసారి కూడా ఆయన పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడలేదని మరి తెలంగాణతో ఆయనకి ఎలాంటి సంబంధం ఉందో తనకు తెలియదన్నారు.అలాగే బీసీ సీఎం పై భాజాపా ఇచ్చిన హామీపై కూడా ఆమె విమర్శలు చేశారు.దేశవ్యాప్తంగా ఓబీసీల కులగణన చేయడానికి నిరాకరిస్తున్న పార్టీ, మహిళల రిజర్వేషన్ల లో బిసి కోటా అమలు చెయ్యడానికి ఇష్టం లేని పార్టీ, బీసీ ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పడం హాస్యాస్పదం అని అదొక ఎలక్షన్ గిమ్మీక్ అంటూ కొట్టి పాడేశారు.ప్రతిపక్షాలు ఎన్ని ఎన్నికల జిమ్మిక్కులు చేసినా మరోసారి కెసిఆర్( KCR ) గద్దే ఎక్కడం ఖాయమని, బారాస హ్యాట్రిక్ కొట్టి తీరుతుంది అంటూ ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.