అవును, ఆమె చనిపోయింది.ఆమె మరెవ్వరో కాదు, ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుల కెక్కిన ఓ ఫ్రెంచ్ మహిళ.
ఆమె తాజాగా కన్ను మూసింది.ఈ మంగళవారం తెల్లవారు జామున 2గంటలకు దక్షిణ ఫ్రాన్స్ టౌలోన్ నగరంలోని తుదిశ్వాస విడిచినట్టు అక్కడి మీడియా ప్రకటించింది.
ఆ వృద్ధురాలి పేరు మీరు వినే వుంటారు.ఆమే లుసిల్లే రాండర్.
క్రైస్తవ సన్యాసిని అయిన ఆమె సిస్టర్ ఆండ్రీగా ప్రసిద్ధి గాంచారు.సెయింట్ కేథరిన్ లేబర్ నర్సింగ్ హోంలో అమె తన జీవనాన్ని కొనసాగించి, తాజాగా తనువు చాలించింది.
కాగా, ఆమె మరణ వార్తను నర్సింగ్ హోం ప్రతినిధి అయినటువంటి డేవిడ్ తవెల్లా తెలిపాడు.1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్సాస్ నగరంలో, అంటే సరిగ్గా మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు లుసిల్లే రాండన్ జన్మించారు.అమె ప్రస్తుత వయస్సు 118 సంవత్సరాలు కావడం విశేషం.ఆమె 119వ ఏట అడుగుపెట్టేందుకు కొద్ది రోజుల ముందే తుదిశ్వాస విడిచారు.జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ 110 సంవత్సరాలు కలిగిన, అంతకంటే ఎక్కువారిని గుర్తిస్తుంది.ఈ క్రమంలో జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) మరణం తరువాత లుసిల్లే రాండన్ ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నీస్ రికార్డుకెక్కింది.

ఆమె పేరుమీద ఇంకో రికార్డు కూడా వుంది.2021లో 117వ పుట్టిన రోజుకు సరిగ్గా కొద్దిరోజుల ముందు ఆమెకు కరోనా సోకింది.అయినా ఆమెను కరోనా రక్కసి ఏమి చేయలేకపోయింది.దానినుండి కోలుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.గతంలో ఆమె ఫ్రెంచ్ మీడియాతో మాట్లాడుతూ.నేను 108ఏళ్ల వయస్సు వరకు పనిచేశానని, ప్రతీరోజూ ఒక గ్లాసు వైన్ తాగడం, చాక్లెట్ తినడం ఇష్టపడతానని తెలిపింది.







