నాచురల్ స్టార్ నాని( Nani ) ప్రస్తుతం దసరా( Dasara ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ సినిమా మార్చి 30 వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన నార్త్ సౌత్ అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో నాని ఏ విషయం గురించి మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదంగా మారుతుంది.
అయితే తాజాగా ఈ విషయం గురించి నాని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఏ విషయాన్ని అయినా ఎలాంటి చెడు ఉద్దేశం లేకుండా మాట్లాడిన పెద్ద ఎత్తున వివాదం చేస్తున్నారని ఈయన తెలిపారు.శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల సమయంలో టికెట్ల రేట్ల గురించి తాను మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని పెద్ద ఎత్తున వివాదాలను సృష్టించారు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సుకుమార్( Sukumar ) గారి గురించి పాజిటివ్ గా మాట్లాడిన దానిని నెగిటివ్ వేలో తీసుకుంటూ పెద్ద ఎత్తున వివాదం సృష్టించారని ఈయన తెలియజేశారు.
ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీడియా నుంచి తనకు ఒక ప్రశ్న ఎదురయింది.చాలామంది హీరోలు అగ్ర దర్శకులతో పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే మీరు మాత్రం కొత్త దర్శకుడుతో ఇలాంటి సినిమా చేయడం ఏంటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు తాను సమాధానం చెబుతూ సుకుమార్ గారు పుష్ప( Pushpa ) సినిమా తీశారు.సుకుమార్ గారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ కానీ ఈయన ఇతర చిత్ర పరిశ్రమలకు కొత్త డైరెక్టరే కదా.ఇలా కొత్త దర్శకుడిగా ఇతర చిత్ర పరిశ్రమలోకి పుష్ప సినిమా ద్వారా అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అలాగే శ్రీకాంత్( Sreekanth ) కూడా ఇప్పుడు కొత్తవాడే కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పాపులర్ అవుతాడని నా అభిప్రాయం చెప్పాను కానీ దానిని కూడా వివాదం చేశారంటూ ఈ సందర్భంగా నాని చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
