ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఆ నేత‌.. మ‌ద్ద‌తు జ‌న‌సేన‌కేనా..?

ఏపీ రాజ‌కీయాల్లో ఆయ‌న బ‌ల‌మైన ముద్ర వేసుకున్న వ్య‌క్తి.అయితే ఆయ‌న ఇప్పుడేం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో లేక‌పోయినా స‌రే ఏపీలో బ‌లంగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గానికి పెద్ద దిక్కులా ఉన్నారు.

 That Leader Into Direct Politics . Support Janasena Janasena, Mudragada Padhma-TeluguStop.com

ఆయ‌న నిత్యం కాపుల కోసం, వారి రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడుతున్నారు.ఆయ‌నే ముద్రగడ పద్మనాభం.

ఈయ‌న పేరు తెలియ‌ని రాజ‌కీయ నేత‌లు ఉండ‌రు.ఆయ‌న ఏ పార్టీకి మ‌ద్ద‌తుగా ఉండ‌కుండా కేవ‌లం కాపుల కోసం పోరాడుతున్నారు.

కాపు రిజర్వేషన్లకోసం సుదీర్ఘకాలంగా పోరాడుతూ కాపుల మ‌న్న‌న‌లు పొందుతున్నారు.

ఇంత చేస్తున్న ఆయ‌న గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఎన్నో సార్లు రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడి జైలు పాలు కూడా అయ్యారు.

కాగా కాలం గ‌డుస్తున్నా కొద్దీ ప్రజాపోరాటాలకు మెల్లిమెల్లిగా దూరం అయ్యారు ప‌ద్మ‌నాభం.ప్ర‌స్తుతం ఆయ‌న కుటుంబ సభ్యులతోనే గ‌డిపేస్తున్నారు.

కాగా చాలా కాలం త‌ర్వాత మొన్న లేఖ‌ల‌తో అస్త్రాలు సంధించారు.చంద్ర‌బాబు క‌న్నీళ్ళ ఘ‌ట‌న త‌ర్వాత ముద్ర‌గ‌డ స్పందించారు.

ఏకంగా చంద్ర‌బాబును విమ‌ర్శిస్తూ లేఖ‌లు రాశారు.త‌న‌ను ఇబ్బంది పెట్టిన‌ప్పుడు జాలి క‌ల‌గ‌లేదా అంటూ చుర‌క‌లు అంటించారు.

Telugu Ap Potics, Chandra Bbau, Janasena, Tdp, Ys Jagan, Ysrcp-Telugu Political

ఇక ఈ లేఖ త‌ర్వాత కూడా ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల‌కు లేఖ‌లు రాస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.వీట‌న్నింటినీ చూస్తుంటే ఆయ‌న మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం.ఏపీలో ప్ర‌స్తుతం ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆయ‌న అడుగులు ఎటువైపు ఉంటాయ‌న్న‌ది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ని ముద్ర‌గ‌డ అధికార వైసీపీకి స‌పోర్టుగా ఉంటారా అంటే క‌ష్ట‌మ‌నే తెలుస్తోంది.

కాపు సామాజిక వ‌ర్గం ఈ మ‌ధ్య జ‌న‌సేన‌కు బ‌లంగా స‌పోర్టు ఇస్తోంది.పైగా వ‌ప‌న్ కూడా కాపు ఫ్యాక్ట‌ర్‌ను న‌మ్ముతున్నారు.కాబ‌ట్టి ఆయ‌న జ‌న‌సేన‌కు అండ‌గా ఉంటార‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube