ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ( Telangana elelctions ) చాలావరకు ప్రజలు “మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి” అనే బాటలోనే ప్రయాణించారు.చాలామంది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూశారు.
కానీ బీఆర్ఎస్ ( BRS ) పార్టీ పరిపాలనలో ఎక్కువమంది పార్టీలో ఉన్నవారికే మేలు జరిగింది.గవర్నమెంట్ నుండి వచ్చిన పథకాలు చాలావరకు పార్టీలో తిరిగేవాళ్లే తీసుకున్నారు.
దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది.అలాగే బీసీ బందు, దళిత బంధు, రైతు బంధు వంటివి బీఆర్ఎస్ ని పెద్ద దెబ్బ కొట్టాయి.
అయితే ఈసారి తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జోరు పెరిగింది.ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో అప్పటినుండి తెలంగాణ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
కచ్చితంగా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో ముందుకు అడుగులు వేసింది.అలా పార్టీలో ఉన్న వాళ్ళందరూ వారి గొడవలను పక్కనపెట్టి ఐక్యతతో పనిచేసే పార్టీని ముందుకు నడిపారు.
మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ( Revanth reddy ) వీరందరిలో కీలకపాత్ర పోషించారని చెప్పుకోవచ్చు.ఇక కీలక సమయంలో బీఆర్ఎస్,బిజెపి పార్టీలో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లోకి రావడం మరింత మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు.
అలాగే కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో పార్టీని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో ముందుకు వచ్చింది.

ఇక కాంగ్రెస్ ( Congress ) అధికారంలోకి రావడంతోనే కచ్చితంగా ఆ ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువస్తాము అనే హామీ ఇవ్వడంతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పై నమ్మకం కుదిరింది.ఈ కారణంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరందుకుంది.ఇక రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు అనే భావన కొంతమంది పేద ప్రజల్లో ఉంది.
ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ వంటి పథకాలు ఎవరికి అందలేదు.ఇక అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు రాని ఊరు అంటూ లేదు.

అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలని గ్రామంలో ఉన్న కార్యకర్తల నుండి ఢిల్లీ స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరు కృషి చేశారు.ఇక ప్రజల్లో కూడా చాలావరకు బీఆర్ఎస్,బిజెపి ( BJP ) ఒక్కటేననే భావన కూడా కలిగింది.దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చాలావరకు కాంగ్రెస్ కి రావచ్చు అనే అంచనాలు వేస్తున్నారు.ఇప్పటికే పోలింగ్ ముగిసాక ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కే అనుకూలంగా ఫలితాలను ఇచ్చాయి.
ఈ లెక్కన తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ జోరు కొనసాగడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ మరికొద్ది గంటలు దాటితే తెలంగాణలో అధికారంలోకి ఏ పార్టీ రాబోతుందో అనేది తేలబోతుంది.