సాధారణంగా కూరగాయల మార్కెట్లో కిలో దొండకాయల( Dondakaya ) ధర ఎంత వరకు ఉంటుంది.ఓ రూ.40 ఉంటుంది లేదంటే రూ.100 వరకు ఉండొచ్చు.అయితే ఓ ప్రాంతంలో కేజీ దొండకాయల ధర ఏకంగా రూ.900 పలుకుతోంది.అయితే ఇది మన దేశంలో అనుకుంటే పొరపాటే.అవును, ఇంగ్లాండ్ ( England )రాజధాని అయినటువంటి లండన్ ( London )లో కిలో దొండకాయ వెయ్యి రూపాయలకు వరకు పలుకుతోంది.లండన్ స్థిరపడిన ఓ భారతీయుడు కేజీ దొండకాయ రూ.900 అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
సూపర్ మార్కెట్ దొండకాయల కొనుగోలు చేద్దామని వెళ్లిన అతగాడు వాటి ధర చూసి ఆశ్చర్యపోయాడు.వెంటనే ప్రైస్ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ ఫొటోను ఓంకార్ ఖండేకర్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.ఫొటోలో కాకరకాయ, బెండకాయ, టమాటా, పచ్చి మిర్చి, వంకాయ ఉన్నాయి.
ఓ ట్రేలో దొండకాయలు ఉన్నాయి.అక్కడ ఓ అట్టపై కిలో దొండకాయ ధర 8.99 పౌండ్లు అని రాసి ఉంది.అంటే మన ఇండియాన్ కరెన్సీలో ఇది రూ.900 పైనే ఉంటుందన్నమాట.
కాగా ఈ పోస్ట్ చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.అయితే ఓ నెటిజన్ మాత్రం డిఫరెంట్ గా స్పందిస్తూ… రోమ్ లో ఉంటే రోమ్ లో ఉన్నట్లు ఉండాలని కామెంట్ చేశాడు.ఇకపోతే గతేడాది అక్టోబరులో యూకే టమాటా ధరలు భారీగా పెరిగాయి.
టమాటా ధరలు భారీగా పెరగడంతో కొన్ని రెస్టారెంట్లు మూతకూడ పడిన పరిస్థితి వచ్చింది.టమాటా ధర క్కో కేసుకు 5 యూరోల నుంచి 20 యూరోలకు పెరిగాయి.
అంటే దాదపు 400% పెరిగాయి.విదేశాల నుంచి సరఫరా తగ్గడం టమాటా రేట్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.