ఆ బిజినెస్‌మ్యాన్ వయసు 45ఏళ్లు.. 18ఏళ్ల కుర్రాడిలా మారెందుకు ఏటా రూ.16 కోట్లు ఖర్చు..

సాధారణంగా నిత్య యవ్వనంగా కనిపించేందుకు చాలామంది యోగా చేస్తుంటారు.ఎక్సర్‌సైజులు, మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేస్తారు.అయితే ఎన్ని చేసినా వయసు పెరుగుతున్న కొద్దీ వృద్ధాప్య ఛాయలు రావడం సహజం.50 ఏళ్ళు వచ్చాక ముసలి వారు కావడం సృష్టి ధర్మం.అయితే దీనికి విరుద్ధంగా ఎప్పటికీ యవ్వనంగా ఉండేందుకు కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యాపారవేత్త పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.

 That Businessman Is 45 Years Old To Change Like An 18-year-old Boy, He Spends Rs-TeluguStop.com

బ్రియాన్ జాన్సన్ అనే 45 ఏళ్ల వ్యాపారవేత్త, యవ్వన రూపాన్ని కొనసాగించే ప్రయత్నంలో ఏటా సుమారుగా $2 మిలియన్లు లేదా రూ.16 కోట్లు ఖర్చు చేశాడు.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, జాన్సన్ తనను తాను 18 ఏళ్ల వయస్సులో ఉంచుకోవడానికి డాక్టర్ల సహాయంతో చికిత్స చేయించుకుంటున్నాడు.

ఈ చికిత్స ద్వారా 18 ఏళ్ల యువకుడి యవ్వనమైన గుండె, ఊపిరితిత్తులు, మెదడు, చర్మంతో సహా ఇతర శారీరక లక్షణాలను సాధించగలనని అతను పేర్కొన్నాడు.జాన్సన్ యూట్యూబ్‌లో తన వీడియోను కూడా పంచుకున్నాడు.

Telugu Calinia, Dr Zolman, Medical, Millionaire-Latest News - Telugu

ఒక మిలియనీర్ సాఫ్ట్‌వేర్ వ్యాపారవేత్త అయిన జాన్సన్‌కి డాక్టర్ ఒలివర్ జోల్‌మాన్ నేతృత్వంలోని 30 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య నిపుణుల బృందం చికిత్స చేస్తోంది.వారు అతని శరీరం వృద్ధాప్యం బారిన పడకుండా తమ వంతు కృషి చేస్తున్నారు.జాన్సన్‌ గతంలో డాక్టర్ జోల్మాన్ యాంటీ ఏజింగ్ సైన్స్ గురించి విస్తృతంగా చదివారు.

శరీరాన్ని నిత్య యవ్వనంగా ఉంచుకోవాలని అప్పుడే అతనికి ఐడియా వచ్చింది.ఆ తర్వాత ఈ వ్యాపారవేత్త తన శరీరంపై ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు.

Telugu Calinia, Dr Zolman, Medical, Millionaire-Latest News - Telugu

కాలిఫోర్నియాలోని వెనిస్‌లోని తన ఇంటిలో మెడికల్ సూట్‌ను జాన్సన్ ఏర్పాటు చేసుకున్నాడు.అతను ఈ సంవత్సరం దాని కోసం సుమారు $2 మిలియన్లు ఖర్చు చేయాలని యోచిస్తున్నాడు.ఇప్పటివరకు తీసుకున్న చికిత్స వల్ల అతను తన శరీర దారుఢ్యాన్ని 18 ఏళ్ల యువకుడిగా మార్చుకోగలిగాడట.

గుండెపరితీరు 38 సంవత్సరాల వ్యక్తిలా మారిందట.ఇక స్కిన్ గ్లోయింగ్ 28 ఏళ్ల వ్యక్తిగా మారిందని అతను వీడియో ద్వారా తెలిపాడు.

ఏదేమైనా 18 ఏళ్ల వ్యక్తిగా మారేందుకు అతడు కోట్లు ఖర్చు చేయడం, ఈ చికిత్సలో మెల్లగా విజయం సాధించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube