హోటల్లో ఆ నటుడు నా చెప్పులు దొంగతనం... మనోజ్ బాజ్ పాయ్ షాకింగ్ కామెంట్స్!

That Actor Stole My Sandals In The Hotel Manoj Baj Pais Shocking Comments

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పంకజ్ త్రిపాటి( Pankaj Tripathi ), మనోజ్ బాజ్ పాయ్( Manoj Bajpayee ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ ఇండస్ట్రీలో తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

 That Actor Stole My Sandals In The Hotel Manoj Baj Pais Shocking Comments-TeluguStop.com

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఆసక్తికరమైన సన్నివేశం గురించి పలు విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా మనోజ్ బాజ్ పాయ్ మాట్లాడుతూ పంకజ్ త్రిపాటి తన చెప్పులు దొంగలించారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఓసారి తాను హోటల్ కి వెళ్ళినప్పుడు తన చెప్పులు పోగొట్టుకుపోయాయని తెలియజేశారు.అయితే తాను ఎక్కడైనా మర్చిపోయానా అనుకున్నాను కానీ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పంకజ్ తన వద్దకు వచ్చి ఆ రోజు హోటల్లో పోయిన నీ చొప్పలను నేనే దొంగతనం చేశాను అంటూ తనకు గుర్తు చేశారని తెలిపారు.పాట్నా హోటల్లో మీ చెప్పులు పోయాయి కదా వాటిని నేను దొంగతనం చేశానని పంకజ్ ఒప్పుకున్నట్లు మనోజ్ వెల్లడించారు.

ఈ విధంగా మనోజ్ మాట్లాడుతూ ఉండగా మధ్యలో పంకజ్( Pankaj ) మాట్లాడుతూ ఆరోజు అసలేం జరిగిందో తెలియచేశారు.అప్పట్లో తాను హోటల్లో కిచెన్ సూపర్ వైజాగ్ గా పని చేసే వాడిని.నేను పనిచేస్తున్న హోటల్ కి మనోజ్ వచ్చారని తెలియగానే అతడు ఏ చిన్న అవసరం వచ్చి పిలిచిన నాకే చెప్పండి నేనే వెళ్తాను అంటూ అప్పటికే సిబ్బందికి చెప్పానని పంకజ్ వెల్లడించారు.

ఇలా తన గదికి వెళ్లి తనతో మాట్లాడి తిరిగి వచ్చాను కానీ అదే హోటల్లో మనోజ్ తన చెప్పులు మరిచిపోయారని తెలియడంతో వాటిని తనకు ఇవ్వకుండా నాకు ఇవ్వమని చెప్పాను అంటూ ఆరోజు తన చెప్పులను నేను తీసుకున్నానని ఈ సందర్భంగా త్రిపాటి వెల్లడించారు.

That Actor Stole My Sandals In The Hotel Manoj Baj Pais Shocking Comments ,Pankaj Tripathi ,Manoj Bajpayee , Pankaj,Gangs Of Wasseypur , Bollywood , - Telugu Bollywood, Gangs Wasseypur, Manoj Bajpayee, Pankaj, Pankaj Tripathi #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube