Tanikella Bharani : అప్పట్లో గంజాయి తాగేవాడిని.. ఎన్నో తప్పులు చేశాను

తనికెళ్ళ భరణి( Tanikella Bharani ) గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.ఎన్నో పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

నటుడిగానే కాదు రచయితగా, దర్శకుడిగా కూడా రాణించారు.1985లో విడుదలైన లేడీస్ టైలర్ మూవీతో తనికెళ్ళ భరణి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.ఆ తరువాత ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు.

ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వం చేసిన శివ సినిమా( Shiva )తో భరణికి మంచి గుర్తింపు వచ్చింది.కెరీర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్, కామెడీ రోల్స్ లో ఎక్కువగా నటించారు.

ఇప్పటికి సినిమాలు చేస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.అయితే తన బాల్యం గురించి, తండ్రితో అనుబంధం గురించి భరణి గుర్తుచేసుకున్నారు.

తాజాగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న తనికెళ్ళ భరణి తన బాల్యాన్ని, తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని బయటికి చెప్పారు.అంతేకాదు ఆయన గంజాయి కూడా తాగేవాడినని చెప్పారు.

Advertisement

భరణి ఏడో తరగతి చదువుతున్నప్పుడు తనకి చెప్పులు కూడా ఉండేవి కాదని, ఒట్టి కళ్ళతోనే నడిచేవాడినని చెప్పారు.ఎలాగైనా చెప్పులు కొనిపించుకోవాలని, రోడ్డు మీద కాల్చి పడేసిన సిగరెట్( Cigarette ) మీద కాలు వేశానని, అమ్మ అని గట్టిగా అరిచానని, ఇక మా నాన్న చెప్పులో కొనిస్తాడనుకున్నాను అని అన్నారు.

కానీ భరణి వాళ్ళ నాన్న చెప్పులు కొనించకుండా చూసుకొని నడవాలి కదా అని తిట్టాడని గుర్తుచేసుకున్నారు.అంతేకాదు ఏదైనా తప్పు చేస్తే చెట్టుకు కట్టేసి కొట్టేవారట.

నాన్నకి చెప్పకుండా ఆయన జేబు నుంచి రెండు రూపాయలు కొట్టేసేవాడినని, ఒకరోజు మాత్రం ఆయన జేబులో నుంచి వంద రూపాయలు తీసుకున్నానని భరణి చెప్పారు.అయితే భరణి వాళ్ళ నాన్న భరణికి పప్పు, నెయ్యి వేసి మంచి భోజనం పెట్టు, రేపటి నుంచే ఎలాగో ఇంట్లో తినలేడు, జైల్లో తింటాడు అని అన్నారట.జేబులో నుంచి వంద రూపాయలు తీస్తావా అని బాగా తిట్టారట.

అంతేకాదు అప్పుడు భరణికి సిగరెట్ అలవాటు కూడా ఉండేదట.ఒకరోజు సిగరెట్ మానేసిన భరణి నాన్న కూడా భరణి జేబులో ఉన్న సిగరెట్ తీసుకొని తాగారట.అంతేకాదు భరణికి గంజాయి అలవాటు కూడా ఉండేదట.

యూకే ఎన్నికల్లో సిక్కు సంతతి ఎంపీల ప్రభంజనం.. అకల్ తఖ్త్ , ఎస్‌జీపీసీ ప్రశంసలు
సినిమా ఫ్లాప్ అయినా వాణిశ్రీ కట్టిన ఆర్గాండి వాయిల్ చీరలు ఫుల్ ఫేమస్

చేదు వ్యసనాలకు అప్పుడు అలవాటు పడ్డానని, దీంతో నాన్న నన్ను బాగా కొట్టారని భరణి గుర్తుచేసుకున్నారు.అయితే నేను పెద్దయ్యాక నాన్న జేబులో వెయ్యి రూపాయలు పెట్టేవాడినని, ఎందుకు పెడుతున్నావ్ అని నాన్న అడిగేవారని చెప్పారు.

Advertisement

అయితే అప్పుడు చెప్పకుండా తీసుకున్న కదా నాన్న, అందుకు ఇప్పుడు వడ్డీ ఇస్తున్న అని సరదాగా చెప్పేవారని భరణి తండ్రి గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

తాజా వార్తలు