రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పక్క సలార్ సినిమా చేస్తూనే మరోపక్క మారుతి డైరక్షన్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.సినిమా షూటింగ్ కూడా సీక్రెట్ గా జరుపుకుంటుందని తెలుస్తుంది.
రామోజి ఫిల్మ్ సిటీలో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు సమాచారం.ఇక ఈ సినిమాకు థమన్ ని మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేశారు.
మారుతి థమన్ ఇదివరకే సినిమాలు చేయగా ప్రభాస్ సినిమాకు ఫస్ట్ టైం ప్రభాస్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ప్రభాస్ నటించిన రాధే శ్యాం సినిమాకు థమన్ కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
ఇక ఇప్పుడు ప్రభాస్ ఫుల్ సినిమా థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అల వైకుంఠపురములో సినిమాతో నేషనల్ అవార్డ్ కూడా అందుకుని కెరియర్ లో సూపర్ ఫాం లో ఉన్న థమన్ ప్రభాస్ తో మొదటిసారి కలిసి పనిచేస్తున్నాడు.
ఈమధ్యనే పవన్, చిరు సినిమాలకు మ్యూజిక్ అందించిన థమన్ ఇప్పుడు ప్రభాస్ సినిమాకు మ్యూజిక్ అందిస్తూ సత్తా చాటనున్నడు.మారుతి ప్రభాస్ క్రేజీ కాంబో ఎలాంటి సినిమాను ప్రేక్షకులకు అందిస్తుందో చూడాలి.
ఈ సినిమాలో మళయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ మూవీకి రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.







