ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ప్రెజెంట్ నటిస్తున్న సినిమా ‘వారిసు’.ఈ సినిమా ఇప్పటికే కోలీవుడ్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.మొదటిసారి విజయ్, రష్మిక జంటగా నటించడం వల్ల ఈ జోడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.అలాగే ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఈ ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేస్తుంది.రిలీజ్ అయ్యి 24 గంటలు కూడా కాకముందే రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది.ట్రైలర్ కు వస్తున్న మాసివ్ రెస్పాన్స్ చూస్తుంటేనే ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.
13 గంటల్లోనే ఏకంగా 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది.దీంతో వారిసు సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమాను తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.జనవరి 11న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.

తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇక్కడ భారీ అంచనాలు క్రియేట్ చేయకపోయినా తమిళ్ లో విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దీంతో అక్కడ ఎలాంటి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ రాబడుతుంది అనే చెప్పాలి.మరి చిరు, బాలయ్య వంటి స్టార్స్ తో పోటీకి సిద్ధం అవుతున్న విజయ్ ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సిందే.







