అదృష్టం, దరిద్రం ఆపితే ఆగేవి కాదు, ఎవరు వద్దాన్నా, కాదన్నా తన్నుకుంటూ వచ్చేస్తాయి ఈ రెండు.అయితే దరిద్రం మాట పక్కన పెడితే అదృష్టం అమెరికా యువకుడిని అడ్డంగా వరించింది.
అలా ఇలా కాదు వీర లెవిల్ ఆ యువకుడిని పట్టుకుంది.ఇంతకీ ఆ అదృష్టం యువకుడుకి ఏ రూపంలో వచ్చిందో తెలుసా ఆ వివరాలు తెలియాలంటే ఓ సారి ఈ వివరం చదవండి.

టెక్సాస్ కి చెందిన యువకుడు కేవలం మూడు డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 206 రూపాయలు పెట్టుబడి పెట్టాడు, దాంతో రాత్రికి రాత్రి ఏకంగా అతడికి 10 కోట్లు ఆదాయం వచ్చింది.అయితే పెట్టుబడి పెట్టింది, లాభం వచ్చింది వ్యాపారం మీద కాదు.టెక్సాస్ లోని ఓ హోటల్ లో గల యూ స్పిన్ జాక్ స్పాట్ మిషన్ పై పందెం కాశాడు.
ఈ మిషన్ పై ఎప్పుడో ఒక సారి అదృష్టం వచ్చి పడుతుంది.
ఈ సారి ఈ యువకుడికి ఆ లక్కు తగిలింది.ఈగల్ పాస్ ప్రాంతానికి చెందినా ఈ యువకుడు అక్కడి క్లబ్ లో మెంబెర్ గా ఉంటున్నాడు.
ఎప్పటిలాగానే క్లబ్ కి వచ్చిన అతడు, పందెం కాయగా 15 లక్షల 48 వేల డాలర్ల రావడంతో అతడి సంతోషానికి అవధులు లేవు.అయితే ఇదే జాక్ పాట్ గతంలో 8 ఏళ్ళ క్రితం వచ్చిందట మళ్ళీ ఈ జాక్ పాట్ తగలడం ఇదేనని నిర్వాహకులు చెప్తున్నారు.







