సీఎఫ్ఓగా ఎన్నారై వైభవ్‌ను నియమించిన టెస్లా కంపెనీ.. అతని గురించిన విశేషాలు ఇవే...

ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే టెస్లా కంపెనీ( Tesla Company ) ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయింది.ఈ కంపెనీ తయారు చేసే కార్లకు వేటికి లేనంత డిమాండ్ ఉంటుందని అనడంలో సందేహం లేదు.

 Tesla Company Appointed Nri Vaibhav As Cfo These Are The Features About Him , Te-TeluguStop.com

కాగా తాజాగా ఈ కంపెనీలో ఓ ఎన్నారై ఒక ఉన్నత పదవిని సాధించారు.ప్రస్తుతం టెస్లా కంపెనీ డబ్బును లెక్కించడం, నిర్వహించడం వంటి డబ్బు వ్యవహారాలకు జకారీ ( Zachary Kirkhorn ) అనే వ్యక్తి బాధ్యతలు వహిస్తున్నారు.

అతను చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఈ కంపెనీలో పని పనిచేస్తున్నారు.కానీ ఇప్పుడు ఆ పని చేయడం మానేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో, కంపెనీ అతడిని ఎందుకు వదులుకుంటుందనే వివరాలు తెలియ రాలేదు.

Telugu Financial, Electric Cars, Elon Musk, Tesla, Vaibhav Taneja-Telugu NRI

అయితే అతని స్థానాన్ని భర్తీ చేయడానికి భారతదేశానికి చెందిన వైభవ్ తనేజా( Vaibhav Taneja ) అనే వ్యక్తి సిద్ధమయ్యారు.ఈ ఏడాది చివరి వరకు జకారీ టెస్లా కంపెనీలో అదే ఉద్యోగంలో పనిచేస్తారు.ఆ తర్వాత నుంచి మన ఇండియన్ యే టెస్లా డబ్బు విషయాలు చూసుకుంటారు.

వైభవ్‌కి ఆల్రెడీ టెస్లా కంపెనీలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం ఉంది.డబ్బును ట్రాక్ చేయడం, ప్రతిదీ సరిగ్గా ఉండేలా చూసుకోవడం అతని ప్రస్తుత జాబ్‌ బాధ్యతలు.

టెస్లాలో చాలా కాలం పాటు పనిచేసినందుకు సంతోషంగా ఉందని, తాము కలిసి ఎంతో సాధించినందుకు గర్విస్తున్నానని జాకరీ చెప్పారు.అతను మంచి నాయకుడిగా ఉన్నందుకు టెస్లా బాస్ ఎలాన్ మస్క్‌కి ధన్యవాదాలు తెలిపారు.

Telugu Financial, Electric Cars, Elon Musk, Tesla, Vaibhav Taneja-Telugu NRI

వైభవ్ తనేజా 2019, మార్చి నెల నుంచి టెస్లాలో పని చేస్తున్నారు.అతను టెస్లాలో చేరడానికి ముందు ఇతర కంపెనీలలో ముఖ్యమైన ఫైనాన్స్, అకౌంటింగ్ ఉద్యోగాలు చేశారు.అకౌంటెంట్‌లో ఈ ఎన్నారైకి 20 ఏళ్ల అనుభవం ఉంది.వైభవ్ వయసు 45 సంవత్సరాలు కాగా అతను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.2016లో సోలార్‌సిటీని కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత టెస్లా బృందంలో ఆయన భాగమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube