పదో తరగతి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అదేవిధంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు.పదవ తరగతి పరీక్షలు మే రెండవ తారీకు నుండి మే 13వ తారీకు వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.

 Tenth Class Inter Exam Schedule Released Adhimulapu Suresh, Ap Governament, And-TeluguStop.com

పదవ తరగతి పరీక్షకు సంబంధించి 6,39,805 మంది విద్యార్థినీ విద్యార్థులు రాస్తున్నట్లు పేర్కొన్నారు.

పరీక్షా సమయం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తామని తెలిపారు.ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 11 నుండి 31 వరకు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.1456 సెంటర్ లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.మొదటి సంవత్సరం పరీక్షలకు 5,05,052 మంది విద్యార్ధులు, రెండో సంవత్సరం పరీక్షలకు 4,81,481 మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారని చెప్పారు.

మొత్తం 9,86,533 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారని.మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టంచేశారు.

Tenth Class Inter Exam Schedule Released Adhimulapu Suresh, Ap Governament, Andrapradesh , Exams, Exams Shedule Relesed, Ys Jagan, Schools - Telugu Andrapradesh, Ap, Exams, Exams Shedule, Schools, Ys Jagan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube