రంగారెడ్డి జిల్లా( Ranga Reddy District ) రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.జీవో నంబర్ 55( Go Number 55 ) ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలోనే పరీక్ష రాస్తున్న సెకండియర్ విద్యార్థులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.అనంతరం విద్యార్థులను, ప్రొఫెసర్లను బయటకు పంపిన స్టూడెంట్ యూనియన్ లీడర్స్( Student Union Leaders ) యూనివర్సిటీ గేటుకు తాళం వేశారు.దీంతో యూనివర్సిటీ వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







