చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
నంజంపేట, ఉప్పరపల్లిలో టీడీపీ ఇంఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి కారుపై దాడి జరిగింది.అనంతరం కొందరు చేసిన రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.
అయితే రెండు చోట్ల వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.కాగా పుంగనూరులో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తుండగా టీడీపీ శ్రేణులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.







