కాకినాడ జిల్లా పిఠాపురంలో( Pithapuram ) ఉద్రిక్తత నెలకొంది.నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంపై( Janasena Office ) కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే కార్యాలయంలో జనసేన ఫ్లెక్సీలకు, జెండాలకు నిప్పు పెట్టిన దుండగులు అక్కడి నుంచి పరార్ అయ్యారని సమాచారం.దీంతో పిఠాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేయనున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.కానీ ఈ విషయంపై నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయంపై దాడి జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.