కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వైసీపీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై వివాదం రాజుకుంది.
దీనిపై టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల బల్లయ్యలు నిరసనకు దిగారు.ఈ క్రమంలో టీడీపీ నేతలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
అనంతరం మాజీమంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.