హైదరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఉద్రిక్తత

హైదరాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) నేతల మధ్య సమన్వయం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించారని తెలుస్తోంది.

ఈ మేరకు ఏఐసీసీ సెక్రటరీ మన్సూర్ అలీ( AICC Secretary Mansoor Ali ) ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.సమావేశానికి ఇతర నేతలు రావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే నేతల మధ్య చెలరేగిన వివాదం ముదరడంతో తోపులాటకు దారి తీసింది.దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన మన్సూర్ అలీ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు.

Advertisement
వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు