అనంతపురము: తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం.జేసీ నివాసం ఎదురుగా విదాస్పదంగా మారిన జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం.
జూనియర్ కాళాశాల ప్రహరీ గోడ నిర్మాణానికి గోతుల తవ్వి పిల్లర్లు వేసిన కాంట్రాక్టర్.పిల్లర్లను తవ్విన గోతులను రాత్రికి రాత్రి పూడ్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.60 అడుగుల రోడ్డును వదిలి ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపట్టాలి అంటున్న మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.నిర్మిస్తున్న కాళాశాల ప్రహరీ గోడ పిల్లర్లను గుంతలను జేసి అనుచరులే పూడ్చి వేశారంటుంన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు.
కళాశాల ప్రహరీ గోడ నిర్మిస్తున్న చోటికి భారీగా చేరుకుంటుంన్న ఇరు వర్గాలు.ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండడంతో సంఘటనా స్దలంలో భారీగా మోహరించిన పోలీసులు.
ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించీ వేసిన పోలీసులు.పట్టణంలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఎవ్వరు ఏలాంటి నిరసనలు ఆందోళనలకు అనుమతి లేదంటుంన్న పోలీసులు.
ముందస్తు చర్యల్లో బాగంగానే పట్టణంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామంటుంన్న పోలీసులు.