రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడలోని సెస్ ఎన్నికల కౌంటింగ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి బీఆర్ఎస్ శ్రేణులను చెదరగొట్టారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, పోలీసుల లాఠీ ఛార్జ్ లో పలువురికి గాయాలు అయ్యాయి.
కాగా వేములవాడ రూరల్ ఫలితంపై గందరగోళం నెలకొంది.సెస్ ఎన్నికల ఫలితం ప్రకటించకముందే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.
ఇప్పటికే 14 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.అయితే అధికారికంగా ఫలితాలు ప్రకటించకముందే ఇరు పార్టీల మధ్య గొడవ చెలరేగింది.
ఈ నేపథ్యంలో వేములవాడలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఇరు పార్టీల నేతలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.