తెలంగాణ వ్యాప్తంగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ కార్మికుల మధ్య వాగ్వివాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది.
వాగ్వివాదం నేపథ్యంలో కార్మికులు పరస్పరం దూషించుకున్నారని తెలుస్తోంది.ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఐదో బొగ్గు గని వద్ద ఇరు పక్షాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు చెందిన కార్మికులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 84 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో మొత్తం 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.







